జమ్మూ వెళ్లకుండా.. పాక్‌ గగనతలంలోకి ఇండిగో విమానం.. కారణం ఇదే..

|

Jun 26, 2023 | 9:32 PM

ఈ నెల ప్రారంభంలో కూడా అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్ వెళ్లే ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇండిగో ఫ్లైట్ 6E-645, అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్‌కి నడుస్తోంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా అట్టారీ నుండి పాకిస్తాన్ గగనతలానికి మళ్లించవలసి వచ్చింది.

జమ్మూ వెళ్లకుండా.. పాక్‌ గగనతలంలోకి ఇండిగో విమానం.. కారణం ఇదే..
Air India
Follow us on

ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్తున్న ఇండిగో విమానం ఆదివారం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఇండిగో 6e-2124 ప్రతికూల వాతావరణం కారణంగా కొంతసమయం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అక్కడ్నుంచి విమానాన్ని అమృత్‌సర్‌కు మళ్లించారు. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటన కొంత సేపు అధికారులను ఆందోళనకు గురి చేసింది. అయితే అదృష్టవశాత్తూ విమానం విజయవంతంగా అమృత్‌సర్‌కు దారి మళ్లించబడింది. అక్కడే సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి ముందే పరిస్థితిని ఇరు దేశాల అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా, విమానం మళ్లింపు విషయంలో జమ్మూ, లాహోర్ ATC మధ్య సమన్వయం జరిగిందని కూడా వివరించారు.

శ్రీనగర్ నుంచి బయలుదేరిన ఈ ఇండిగో విమానం జమ్మూ విమానాశ్రయంలో దిగాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని అమృత్‌సర్‌లో ల్యాండ్ చేయమని కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలంలో కొంత సమయం ఎగిరింది.

మరోవైపు, ఈ నెల ప్రారంభంలో కూడా అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్ వెళ్లే ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇండిగో ఫ్లైట్ 6E-645, అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్‌కి నడుస్తోంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా అట్టారీ నుండి పాకిస్తాన్ గగనతలానికి మళ్లించవలసి వచ్చింది. మళ్లింపు అమృత్‌సర్ ATC నుండి టెలిఫోన్ ద్వారా పాకిస్తాన్‌తో సమన్వయం చేశారు. సిబ్బంది పాకిస్తాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టుగా వెల్లడించారు. విమానం అహ్మదాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇదే విషయాన్ని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..