Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. అధ్యక్ష సచివాలయం కీలక ప్రకటన

|

May 22, 2022 | 9:06 AM

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో(Sri Lanka) విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రెండు వారాల క్రితం విధించిన ఎమర్జెన్సీని ఆ దేశ ప్రబుత్వం ఎత్తివేసింది. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి....

Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. అధ్యక్ష సచివాలయం కీలక ప్రకటన
Srilanka Crisis
Follow us on

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో(Sri Lanka) విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రెండు వారాల క్రితం విధించిన ఎమర్జెన్సీని ఆ దేశ ప్రబుత్వం ఎత్తివేసింది. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీని(Emergency in Sri Lanka) ఎత్తివేస్తున్నట్లు అధ్యక్ష సచివాలయం ప్రకటన విడుదల చేసింది. రెండు వారాల క్రితం శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రెండోసారి అత్యయిక పరిస్థితి విధించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పోలీసులు, భద్రత దళాలకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి వారికి అధికారం ఉంటుంది. గతంలో నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చేలరేగింది. పలువురు పోలీసులతో పాటు నిరసనకారులు గాయపడ్డారు. శ్రీలంకలో ఈ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. స్తున్నారు. అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. నిరసనకారుల ఆందోళనతో ఆదేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీపదేశంలో రాజపక్సే కుటుంబం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగాయి. ఈ దాడులు హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణల్లో దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. ప్రధాని రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దయింది.

శ్రీలంకకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న ఇండియా.. మరో 40,000 టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. బియ్యం, ఔషధాలు, పాలపొడి వంటి అత్యవసర ఉపశమన సామగ్రితో భారత్‌ (చెన్నై) నుంచి ఓ నౌక కూడా శుక్రవారం బయల్దేరింది. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా శ్రీలంకకు 1.5 మిలియన్‌ డాలర్ల (రూ. 11.67 కోట్ల) విలువైన అత్యవసర సాయాన్ని జపాన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం, పప్పులు, నూనె వంటివాటిని పంపించనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Kanika Marriage Photos: పెళ్లిపీటలెక్కిన బాలీవుడ్ సింగర్.. వైరల్ అవుతున్న కనికా కపూర్ పెళ్ళిఫోటోలు.. 

Petrol Pump: భారతదేశంలోని పెట్రోల్‌ పంపుల్లో ఈ ఆరు సదుపాయాలు ఉచితమే.. లేకపోతే ఫిర్యాదు చేయవచ్చు..!