Sri Lanka President House: శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో ఆందోళనకారుల స్విమ్మింగ్‌

|

Jul 09, 2022 | 4:48 PM

Sri Lanka President House: శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆందోళనకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు..

Sri Lanka President House: శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో ఆందోళనకారుల స్విమ్మింగ్‌
Follow us on

Sri Lanka President House: శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆందోళనకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స వారి నుంచి తప్పించుకుని పరారయ్యారు. అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. పరిస్థితిని అదుపు తప్పడంతో సైన్యం టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు పట్టించుకోకపోవడంతో లాఠీఛార్జ్‌ చేశారు. ఇందులో ఆందోళనకారులతో పాటు మరి కొందరి పోలీసులకు గాయాలు అయ్యాయి. అధ్యక్షుడి ఇంటిలోకి చొచ్చుకువచ్చిన ఆందోళనకారులు.. ఆయన నివాసంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో స్విమ్మింగ్‌ చేశారు. అధ్యక్షుడు రాజపక్సను ఓ రహస్య ప్రాంతానికి తరలించింది సైన్యం. ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోని వంటగదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆహారాలను ఆరగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

ఇవి కూడా చదవండి


ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడి మీడియా ప్రసారం చేసింది. గత కొద్దినెలలోగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కాగా, శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేక‌పోవ‌డంతో ఆ దేశ అవ‌స‌రాల‌కు స‌రిప‌డే ఇంధ‌నాన్ని కూడా అక్కడి సర్కార్‌ కొనుగోలు చేయ‌లేక‌పోతోంది.

 


అయితే రోజురోజుకు శ్రీలంకలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోవడంతో కొలంబో పోర్టు నుంచి 2 నేవీ షిప్‌లు వెళ్లాయి.

 


అధ్యక్షుడు రాజపక్స నివాసంలో ఖరీదైన కార్లు పార్కింగ్‌ చేసి ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి