Sri Lanka: జూలై 13న రాజీనామాకు సిద్ధమైన రాజపక్స హఠాత్తుగా పరారవడం వెనుక అసలుకారణం ఇదేనా?

|

Jul 10, 2022 | 12:11 PM

ఈ ఏడాది ప్రారంభం నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ మరింత ఆధ్వానంగా తయారవుతోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అధ్యక్ష భవనం నుంచి పలాయనం చిత్తగించారు. సుదీర్ఘ కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశంలోని దాదాపు 22 మిలియన్ల మంది ప్రజలు..

Sri Lanka: జూలై 13న రాజీనామాకు సిద్ధమైన రాజపక్స హఠాత్తుగా పరారవడం వెనుక అసలుకారణం ఇదేనా?
Sri Lanka Crisis
Follow us on

Sri Lanka economic crisis: ఈ ఏడాది ప్రారంభం నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ మరింత ఆధ్వానంగా తయారవుతోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అధ్యక్ష భవనం నుంచి పలాయనం చిత్తగించారు. సుదీర్ఘ కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశంలోని దాదాపు 22 మిలియన్ల మంది ప్రజలు గోటబయ రాజపక్స ప్యాలెస్‌లో నిరసనలు చేపట్టారు. ఓ వైపు ప్రజలు నిత్యావసరాల కోసం పెనుగులాట, మరోవైపు ఇంధనాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన లంక ప్రభుత్వంపై శనివారం మధ్యాహ్నం ఆగ్రహ జ్వాల మిన్నంటింది. రాజపక్స సోదరుడు మహింద రాజపక్స మేలో రాజీనామా చేసినప్పటికీ.. గత కొంత కాలంగా వస్తున్న రాజీనామా డిమాండ్లపై స్పందించని లంక అధ్యక్షుడు పారిపోయినట్లు మీడియా సంస్థలు ప్రకటించాయి.

భారీ నిరసనల మధ్య శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోసారి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నట్లు, అందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అప్పటికే వీధుల్లోకి దుసుకొచ్చిన నిరసన కారులు ప్రధాని ప్రైవేట్ నివాస గృహానికి నిప్పంటించారు కూడా. ఇక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కూడా జూలై 13న శాంతియుతంగా పదవీవిరమణ చేయనున్నాట్లు స్పీకర్‌ మహింద యాపా అబేవర్దన అధ్యక్షుడి తరపున శనివారం ప్రకటించారు. చట్టాన్ని గౌరవించి, శాంతిభద్రతలు కాపాడవల్సిందిగా లంక ప్రజలను స్పీకర్‌ కోరారు. ఐతే అనూహ్యంగా శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాజపక్స పరారయినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

పవర్‌ఫుల్ పొలిటీషియన్స్‌గా పేరుగాంచి రాజపక్స సోదరులు శ్రీలంక ఆర్థిక సంక్షోభం మూలంగా నిందలు ఎదుర్కొన్నారు. 2009లో వేర్పాటువాద తిరుగుబాటుదారులను అణచివేసిన మహింద రాజపక్స హీరోగా మన్ననలు అందుకున్నాడు. ఆ సమయంలో మహింద రాజపక్స సోదరుడు డిఫెన్స్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక సవాళ్లను లంక ఏ విధంగా ఎదుర్కొంటుదో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తల కోసం క్లిక్‌ చేయండి.