కొత్తరకం కరోనా వైరస్‌ను ఎదర్కోగల సత్తా మా వ్యాక్సిన్‌కు గలదు.. యూరప్ దేశాలకు షాకిచ్చిన..

|

Dec 21, 2020 | 7:48 PM

బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్‌తో పాటుగా యూరప్ దేశాలన్నింటిని వణికిస్తోంది.

కొత్తరకం కరోనా వైరస్‌ను ఎదర్కోగల సత్తా మా వ్యాక్సిన్‌కు గలదు.. యూరప్ దేశాలకు షాకిచ్చిన..
Follow us on

బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్‌తో పాటుగా యూరప్ దేశాలన్నింటిని వణికిస్తోంది. దీని దెబ్బకు ప్రధాన నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ల పర్వం మొదలైంది. ఇప్పటికే పలు దేశాలు విమాన సర్వీసులన్నింటిని రద్దు చేశాయి. జల మార్గాలను కూడా మూసి వేశారు. అయితే ఆ వైరస్‌ను తాము తయారుచేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ఎదుర్కోగలదని రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ డిమిట్రీవ్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తమకున్న సమాచారం ప్రకారం యూరప్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా స్ట్రైన్‌పై స్పుత్నిక్‌-వి ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఎస్-ప్రొటీన్ గత పరివర్తనలపైనా స్పుత్నిక్-వి ఎంతో ప్రభావవంతంగా పనిచేసిందన్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని రష్యావైపు చూస్తున్నాయి. అంతేకాకుండా కొవిడ్-19 కొత్త మ్యుటేషన్ స్ట్రైన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రాజెనెకాతోపాటు మరో వ్యాక్సిన్ తయారీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్టు డిమిట్రీవ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ పరివర్తన చెందిన ప్రస్తుత సమయంలో అలాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేయడం ఎంతో అవసరమన్నారు. స్పుత్నిక్ టీకా వినియోగం కోసం బెలారస్‌లో రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్పారు. కాగా స్పుత్నిక్-వి టీకా 95 శాతానికి పైగా ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.