అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్టులో భారీ ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. అయితే ఆ తర్వాత ఫ్లయిట్‌లో మంటలను ఆర్పేయడంతో ముప్పు తప్పింది.
స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టంపా నుంచి అట్లాంటాకు వెళ్తోంది. అయితే అట్లాంటా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అట్లాంటా ఎయిర్‌పోర్టులో ఉన్న ఫైర్ సిబ్బంది వెంటనే విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 383 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అట్లాంటా ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.