రాత్రివేళలో గాఢ నిద్రలో ఉన్నసమయంలో ఒకొక్కసారి చెవుల దగ్గర దోమలు తిరుగుతూ సందడి చేస్తూ చికాకు పెడతాయి. అంతేకాదు ఒకొక్కసారి చెవుల్లో, ముక్కుల్లో దోమలు, చిన్న చిన్న పురుగులు చేరుకుని చికాకు పెడుతూ ఉంటాయి. అంతేకాదు బాధను కలిగిస్తాయి. అయితే చెవుల్లోకి ఏదైనా వెళ్లిన వెంటనే వాటిని బయటకు తీసేసేవరకూ ఏమీ తోచదు.. అంతగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, చైనాకు చెందిన ఓ మహిళ చెవిలో ఓ సాలీడు కాపురం పెట్టేసింది. ఏకంగా తన కుటుంబం నివసించడానికి ఆ యువతి చెవిని ఆవాసంగా చేసుకుని ఒక గూడుని నిర్మించుకుంది.
ఏప్రిల్ 20న సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి చెవి నొప్పితో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్ళింది. అప్పుడు వైద్యులు యువతి చెవిని ఎండోస్కోపీ చేయగా ఓ వింత సంఘటన జరిగింది. చెవిలో సాలీడు ఉన్నట్లు.. అందుకనే ఆ యువతి చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్నారు వైద్యులు.
ఎండోస్కోపీ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. చెవి లోపల ఒక సాలీడు ఉన్నట్లు.. అది కర్ణభేరి దగ్గర అల్లిన ఒక సిల్కి సాలీడు గూడు వీడియోలో కనిపిస్తుంది.
Doctor finds spider in woman’s ear. ?? #RTJ pic.twitter.com/6uFUPP0sJc
— Ricki-Lee, Tim & Joel (@rickileetimjoel) April 28, 2023
అనంతరం వైద్యులు ఆ యువతికి ఆపరేషన్ చేసి.. చెవిలో సాలీడుని సాలీడు గూడుని తీశారు. ఇదే విషయాన్నీ ఆ దేశ మీడియా తెలియాజేస్తూ.. సాలీడు చెవిలో గూడు కట్టేవరకూ ఆ యువతి ఎలా ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే మన దేశంలో కూడా ఇలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక మహిళ తన చెవి నుండి స్పైడర్ బటయకు తీసుకున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫుటేజ్ 2018లో వైరల్ అయ్యింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..