Crying Room: మనిషికి నవ్వు, ఏడుపు అనేవి సహజమైన ఫీలింగ్స్. అయితే నవ్వుకు ఉన్న పాజిటివ్‌నెస్ ఏడుపునకు ఉండదు. నవ్వితే ఎవరూ తప్పు పట్టరు కానీ ఏడిస్తే మాత్రం ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంటారు. అయితే మనసారా నవ్వితే ఎంత హాయిగా ఉంటుందో.. ఏడిస్తే కూడా అలాంటి భావనే కలుగుతుంది. మనసులోని బాధలు కన్నీటి రూపంలో బయటకు పోతే మనసు తేలిక పడుతుంది. అయితే నలుగురిలో ఏడిస్తే ఏమనుకుంటారో అని నాలుగు గోడల మధ్య ఏడుస్తుంటారు. కానీ నవ్వడానికి లేని ఇబ్బందిక ఏడవడానికి ఎందుకు అన్నట్లు స్పెయిన్‌లో సరికొత్త సంస్కృతికి తెరతీశారు. మనసార ఏడవడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ఈ ‘క్రైయింగ్ రూం’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒత్తిడి, ఆందోళన సమస్యలను ఎదుర్కొంటున్న వారు సమస్యల నుంచి బయటపడడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మనసులో బాధపడుతున్న వారు ఈ ప్రత్యేక గదుల్లో మనసారా ఏడవొచ్చు. సెంట్రల్ మాడ్రిడ్‌లో ఏర్పాటు చేసిన ఈ గదుల్లో ఎప్పుడూ మానసిక వైద్యులు అందుబాటులో ఉంటారు.
ఇక స్పెయిన్ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకోవడానికి దేశంలో జరుగుతోన్న ఆత్మహత్యలు కారణంగా చెబుతున్నారు. 2019లో స్పెయిన్‌లో ఏకంగా 3,671 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. స్పెయిన్ జనాభాలో దాదాపు 5.8 శాతం మంది ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారని అలాంటి వారి కోసమే ఈ క్రైయింగ్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్ం చెబుతోంది.
Also Read: IRCTC: నేడు ప్రారంభం కానున్న జ్యోతిర్లింగ దర్శన్ యాత్రా ట్రైన్: ప్యాకేజీ వివరాలు ఇవే!
పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. ఇంటికింద వందల సంఖ్యలో పాములు.. వీడియో
Viral Video: అబ్బాయిగా మారిన అమ్మాయి.. ఎందుకో తెలిస్తే..! వీడియో