రష్యా విమానంపై దక్షిణ కొరియా సైన్యం కాల్పులు..

మంగళవారం తమ గగనతలంలోకి రష్యా విమానం దూసుకురావడంతో తమ సైన్యం కాల్పులు జరిపినట్టు ప్రకటించింది దక్షిణ కొరియా. రష్యా మిలటరీ తీరుపై సియోల్‌లో దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ నిప్పులు చెరిగింది. అదే విధంగా చైనాకు చెందిన రెండు బాంబర్లతో పాటు రష్యాకు చెందిన రెండు బాంబర్ జెట్స్ తమ గగన తలంలోకి ప్రవేశించాని ఆరోపించింది. ఇదిలా ఉంటే తాము దక్షిణకొరియా గగనతలంలోకి ప్రవేశించామని చెప్పడం పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసింది రష్యా. వారి రక్షణ పైలెట్లే […]

రష్యా విమానంపై దక్షిణ కొరియా సైన్యం కాల్పులు..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 9:31 PM

మంగళవారం తమ గగనతలంలోకి రష్యా విమానం దూసుకురావడంతో తమ సైన్యం కాల్పులు జరిపినట్టు ప్రకటించింది దక్షిణ కొరియా. రష్యా మిలటరీ తీరుపై సియోల్‌లో దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ నిప్పులు చెరిగింది. అదే విధంగా చైనాకు చెందిన రెండు బాంబర్లతో పాటు రష్యాకు చెందిన రెండు బాంబర్ జెట్స్ తమ గగన తలంలోకి ప్రవేశించాని ఆరోపించింది. ఇదిలా ఉంటే తాము దక్షిణకొరియా గగనతలంలోకి ప్రవేశించామని చెప్పడం పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసింది రష్యా. వారి రక్షణ పైలెట్లే అతి ఉత్సాహాన్ని ప్రదర్శించాని కూడా రష్యా ప్రత్యారోపణ చేసింది.

దక్షిణ కొరియా దేశానికి అటు చైనా, ఇటు రష్యాతో సత్సంబంధాలు లేవు. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తొలిసారి రష్యాపై దక్షిణ కొరియా ఇలాంటి ఆరోపణలు చేసింది.