అగ్రరాజ్యం, టెక్నాలజీలో ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకే షాకిచ్చాయి అక్కడి ఐటీ కంపెనీలు. హెచ్1బీ వీసాల కోసం ఫెడరల్ వ్యవస్థనే టాంపర్ చేశాయి కొన్ని ఐటీ కంపెనీలు. ఈ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన అమెరికా యాక్షన్‌లోకి దిగింది. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ అసాధారణ ప్రకటన చేసింది. ఇంతకీ, H1B వీసా రిజిస్ట్రేషన్లలో ఏం జరిగింది.? లాటరీ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిందెవరు.? ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది? తెలుసుకుందాం..
అమెరికా వెళ్లాలనేది ఎంతోమంది కల, అగ్రరాజ్యంతో చదువుకోవాలని, ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. కానీ, అమెరికా వీసా అంత ఈజీగా రాదు. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించినా… వీసా కోసం అనేక సవాళ్లు, కష్టాలు, తిప్పలు తప్పవు. అమెరికా పలు రకాల వీసాలు ఆఫర్ చేస్తోంది, కానీ ఇందులో రారాజు మాత్రం H1Bనే. అమెరికాలో ఉండే కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించే వీసా ఇది.
దీంతో ఈ వీసాలను దక్కించుకోవడం కోసం టాప్ కంపెనీలు పోటీపడుతుంటాయి. ప్రతి ఏటా లక్షలాదిమంది H1B కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. H1B వీసాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అందుకే, H1B వీసాల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయ్ కంపెనీలు. H1B వీసాల కోసం కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది అమెరికా. కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్‌లో చీటింగ్ జరుగుతున్నట్టు తేల్చింది. వీసాలు దక్కించుకునేందుకు ఒకే దరఖాస్తుదారు పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు గుర్తించింది.
దీంతో H1B రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించబోతున్నట్లు అసాధారణ ప్రకటన చేసింది అమెరికా ఫెడరల్ ఏజెన్సీ. H1B వీసా లాటరీ సిస్టమ్ టాంపరింగ్‌ను సీరియస్‌గా తీసుకుంది అమెరికా. ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన ఫెడరల్ ఏజెన్సీ… ఒకటి కంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లపై చర్యలకు రెడీ అవుతోంది. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి, అమెరికా ఏం చేయబోతోంది. కొత్త నిబంధనలతో చిక్కుల్లో పడేస్తుందా! లేక ప్రాసెస్‌ను మరింత ఈజీ చేస్తుందా చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..