Solar Storm: టెన్షన్.. టెన్షన్.. సౌర తుపాను భూమిని తాకనుందా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

|

Feb 13, 2023 | 9:55 PM

ఇదే భయం ఇప్పుడు శాస్త్రవేత్తల్లో మొదలయ్యింది. స్పేస్ వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ఇటీవల సూర్యునిలో 2 కొత్త సన్ స్పాట్స్‌ను గుర్తించారు. ఆ రెండూ భూమికి అభిముఖంగా ఉన్నాయి.

Solar Storm: టెన్షన్.. టెన్షన్.. సౌర తుపాను భూమిని తాకనుందా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
Solar Storm
Follow us on

ఇదే భయం ఇప్పుడు శాస్త్రవేత్తల్లో మొదలయ్యింది. స్పేస్ వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ఇటీవల సూర్యునిలో 2 కొత్త సన్ స్పాట్స్‌ను గుర్తించారు. ఆ రెండూ భూమికి అభిముఖంగా ఉన్నాయి. వాటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలకు కళ్లు బైర్లు కమ్మే విషయం తెలిసింది. ఏ క్షణమైన భారీ సౌర తుపాను భూమిని తాకనుందన్న విషయం వారికి అర్థమయ్యింది. అదే జరిగితే.. భారీ సౌర తుపాను భూమిని తాకనుందని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలనున్నాయని, అలాగే రేడియో, జీపీఎస్ సిగ్నల్ వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్నది NOAA తాజా వార్నింగ్. అదే జరిగితే ప్రమాద తీవ్రత మనం ఊహించలేనంతగా ఉండవచ్చంటున్నారు సైంటిస్టులు. ఈ సౌర తుపానుల్లో M — X అని లెవెల్స్ ఉంటాయి. అందులో M లెవెల్ తుపాను ప్రభావం కొద్దిగానే ఉండవచ్చు. అదే X లెవెల్ తుపాను సంభవిస్తే మాత్రం దాని ప్రభావం అతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజా అంచనాల ప్రకారం.. ఈ వారంతంలో సౌరతుపాను భూమిని తాకే ప్రమాదం ఉంది. గత కొద్ది వారాలుగా పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికే అనేక సౌర తుపానులు భూమిని తాకాయి. సౌరమండలంలో జరుగుతున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న నాసా కూడా దాదాపు ఇదే విషయం చెబుతోంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం X లెవల్ సౌర తుపాను తాకే అవకాశాలు లేకపోలేదని, అదే జరిగితే ఇంటర్నెట్, రేడియో, సెల్ ఫోన్ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలుతాయని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమేనని భావిస్తున్నారు. వీలైనంత వరకు ఈ తుపాను భూమిని తాకకుండా ఉంటే మంచిదన్నది వారి భావన. కానీ, మున్ముందు ఏం జరుగుతుందోనని.. భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..