Europe: ఐరోపా ప్రజలకు శత్రువులుగా మారిన 4 పరిశ్రమలు.. రోజూ 7వేల మంది మృతి.. WHO హెచ్చరిక

|

Jun 12, 2024 | 2:51 PM

WHO యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ "ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలోని 53 దేశాలలో ప్రతిరోజూ కనీసం 7 వేల మందిని చంపుతున్నాయని పేర్కొన్నారు. ఈ నాలుగు పరిశ్రమలు ప్రజా జీవన విధానాలను అడ్డుకుంటున్నాయని WHO ఆరోపించింది. అంతేకాకుండా తప్పుడు వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, సైన్స్‌ను అపహాస్యం చేయడం వంటి వాటిపై ఆరోపణలు చేశారు. కంపెనీలు పాటిస్తున్న విధానాల వల్ల ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కష్టమని WHO చెబుతోంది.

Europe: ఐరోపా ప్రజలకు శత్రువులుగా మారిన 4 పరిశ్రమలు.. రోజూ 7వేల మంది మృతి.. WHO హెచ్చరిక
World Health Organization
Follow us on

ఐరోపా ప్రజల ఆహారపు అలవాట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోజు రోజుకీ యూరోపియన్ల ఆహారపు అలవాట్లలో మార్పులు ఉన్నాయని.. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని WHO ఓ నివేదికను పంచుకుంది. ముఖ్యంగా నాలుగు రకాల పరిశ్రమల గురించి నివేదికలో చాలా ముఖ్యమైన విషయాలు వెల్లడించింది. మద్యం, పొగాకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ , శిలాజ ఇంధనం ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలో 27 లక్షల మరణాలకు కారణమని ఈ నివేదికలో పేర్కొంది.

WHO యూరోప్ ప్రాంతంలో కమర్షియల్ డిటర్మినెంట్స్ ఆఫ్ నాన్‌కమ్యూనికేబుల్ డిసీజెస్’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో ఈ పరిశ్రమలను ఆపడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలకు పిలుపునిచ్చింది. ఇదే విషయంపై WHO యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ “ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలోని 53 దేశాలలో ప్రతిరోజూ కనీసం 7 వేల మందిని చంపుతున్నాయని పేర్కొన్నారు.

ఈ నాలుగు పరిశ్రమలు ప్రజా జీవన విధానాలను అడ్డుకుంటున్నాయని WHO ఆరోపించింది. అంతేకాకుండా తప్పుడు వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, సైన్స్‌ను అపహాస్యం చేయడం వంటి వాటిపై ఆరోపణలు చేశారు. కంపెనీలు పాటిస్తున్న విధానాల వల్ల ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కష్టమని WHO చెబుతోంది.

ఇవి కూడా చదవండి

కఠిన చట్టాలను అమలు చేయాలి

లాభార్జన చేయడమే అన్ని శాఖల ప్రాధాన్యత అని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ పరిశ్రమలు మార్కెట్‌లో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి, దీని కారణంగా అవి తరచుగా రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేచేస్తున్నాయి. WHO ప్రకారం ఐరోపాలో 60 శాతం మంది పెద్దలు, మూడింట ఒక వంతు మంది పిల్లలు ఊబకాయం (అధిక బరువు)తో బాధపడుతున్నారు.

2017 నుండి వచ్చిన డేటా ప్రకారం ఐరోపాలో గుండె జబ్బులు, క్యాన్సర్‌తో మరణిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు తప్పుడు ఆహారపు అలవాట్ల ఫలితమేనని వెల్లడించింది. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చట్టాలను అమలు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ యూరోపియన్ దేశాలకు పిలుపునిచ్చింది. నివేదిక అందజేస్తూ.. ఆరోగ్యానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా దేశాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

వ్యవస్థను నియంత్రిస్తోన్న పరిశ్రమలు

ఈ పరిశ్రమల నెట్‌వర్క్ చాలా పెద్దదని.. అవి ప్రభుత్వాల విధాన రూపకల్పనలో కూడా జోక్యం చేసుకుంటున్నాయని హన్స్ క్లూగే చెప్పారు. కంపెనీల గుత్తాధిపత్య పద్ధతులు, లాబీయింగ్ పద్ధతులను ఆపడానికి చర్యలు తీసుకోవాలని క్లూగే యూరోపియన్ దేశాలను కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..