బెల్జియం (Belgium) కార్నివాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రాజధాని బ్రస్సెల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని స్ట్రెపీ-బ్రాక్వెగ్నీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా కార్నివాల్ వేడుకలు జరగలేదు. ఈసారి కరోనా వ్యాప్తి తగ్గడంతో సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదం (Tragedy) నింపింది. కారు వేగంగా వెనక్కి ప్రయాణించి.. గుమిగూడి ఉన్న కొందరిపైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని నగర మేయర్ జాక్వెస్ గోబర్ట్ వెల్లడించారు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ (Arrest) చేశారు. పోలీసులు వెంటపడటంతో ఆ కారు వేగంగా వెనక్కి వచ్చి జనంపైకి దూసుకెళ్లినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆ దేశ అధికారులు దీనిని ఖండించారు. కాగా, ఎంతో ఆనందంగా జరగాల్సిన కార్నివాల్ విషాదంగా మారిందని బెల్జియం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రంగలోకి దిగనున్న ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు
RRR: మూవీ లవర్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఆ ఫార్మాట్‌లో కూడా విడుదల..