నార్వే మెరిసిపోయింది. అలాగా ఇలాగా కాదు.. ఆకాశంలో రాత్రి సమయంలో సూర్యుడు ఉదయించాడా అనేంతగా. ఇదెలా జరిగిందంటే.. ఒక పెద్ద ఉల్కాపాతం ఆదివారం తెల్లవారుజామున నార్వేలో ఆకాశాన్ని ప్రకాశవంతంగా చేసేసింది. దేశ రాజధాని ఓస్లో సమీపంలో కొంతసేపు ఈ ఉల్కాపాతం మిరిమిట్లు గొలుపుతూ పగటి వెలుగులా ఆ ప్రాంతాన్ని మార్చేసింది. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడూ ఇంత దేదీప్యమానమైన ఉల్కాపాతాన్ని చూడలేదని వారు అంటున్నారు. ఉల్కాపాత సమయంలో వచ్చిన వెలుగు చూసిన అక్కడి ప్రజలు ముందు ఎదో యుద్ధప్రమాదం ముంచుకువచ్చింది అని భయపడ్డారు. కానీ.. అది ఉల్కాపాతం అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నార్వేజియన్ ఉల్కాపాతం నెట్‌వర్క్ ప్రతినిధి స్టెయినార్ మిడ్స్‌కోజెన్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ, “ఉల్కాపాతం కొద్దిసేపు ఆకాశాన్ని వెలిగించింది” అని చెప్పారు. ” ఉల్కాపాతం ఆకాశాన్ని దేదీప్యమానం చేసిన ఒక నిమిషం తరువాత పెద్ద శబ్దం వచ్చింది. ఈ ఉల్కాపాతం నేరుగా పైకి కనిపిస్తున్న ప్రదేశం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటుంది.” అని ఆయన వివరించారు.
ఉల్కల మార్గానికి దగ్గరగా ఉన్న కొంతమందికి ఇది షాక్ వేవ్ లా అనిపించింది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఉల్కాపాతం వలన ఎటువంటి నష్టం జరగలేదు. ఓస్లో నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఈ ఉల్కాపాతం పడిపోయిందని నిపుణులు చెప్పారు. నిజానికి నార్వేలో ఉల్కాపాతం అసాధారణం ఏమీ కాదు. తరచుగా ఇక్కడ ఇలా ఆకాశం నుంచి ఉల్కలు జారిపడతాయి. కానీ, ఈసారి కనిపించిన ఉల్కాపాతం చాలా ప్రకాశవంతంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఉల్కాపాతాన్ని నార్వేలో ఎప్పుడూ కెమెరాలు పర్యవేక్షిస్తుంటాయి. ఈ కెమెరాలు ఇచ్చిన వీడియోల నుంచి వచ్చిన ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఉల్కాపాతం దగ్గరలోని లేయర్ లో పదిపాయినట్లు తెలుస్తోంది.
నార్వేలో ఉల్కాపాతానికి సంబంధించిన ట్వీట్ ఇదీ..
Remnants of bolid over Oslo (July 25, 2021, 01:09 CEST). Sound came more than 3 minutes later) #meteor #bolid #Norway pic.twitter.com/qwzzTSdAqa
— Tomas Mikoviny (@slowbrain) July 24, 2021
ఉల్కలు అంటే..
ఉల్క అంటే సౌరమండలంలో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటారు. వీటిని, ‘షూటింగ్ స్టార్స్’ లేదా ‘రాలుతున్న తారలు’ అంటారు. దీని పేరుకు మూలం గ్రీకు భాష. ఉల్క అనే పదానికి అర్థం ‘ఆకాశంలో ఎత్తున’.
Also Read: తాలిబన్ల పోరుతో భారత పర్యటనను వాయిదా వేసుకున్న ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ అహ్మద్ జాయ్..
Jeff Bezos: జెఫ్ బెజోస్‌ను కిడ్నాప్ చేసిన ఏలియన్లు.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్ సంస్థ