జరిగిన సంఘటన నిజంగా హృదయ విదారకం. 11 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా సముద్రంలో గడిపిన ముగ్గురు వ్యక్తులను స్పానిష్ కోస్ట్‌గార్డ్ రక్షించారు. పొట్టకూటి కోసం ప్రాణాలకు తెగించి వలస వెళ్తున్నారు ఆఫ్రికా దేశస్తులు. ఓ నౌక చుక్కానిపై 11 రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా ముగ్గురు వ్యక్తులు ప్రయాణించిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. నైజీరియా నుంచి అలిథిని-2 అనే నౌక ఆయిల్‌తో..అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 11రోజుల పాటు ప్రయాణించి స్పెయిన్‌లోని కేనరీ ఐలాండ్ తీరానికి చేరుకుంది. అక్కడ కోస్ట్ గార్డులు ఓడ చుక్కానిపై ఉన్న ముగ్గురిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
తమకు తినేందుకు తిండి కూడా లేదని..అందుకే ఉపాధిని వెతుక్కుంటూ వలస వచ్చినట్టు తెలిపారు ఆ ముగ్గురు. నైజీరియాలోని లాగోస్ నుంచి ఇలాగే ప్రయాణించినట్టు వెల్లడించారు. ఆ విషయాలు విన్న కోస్ట్ గార్డులు షాక్‌కు గురయ్యారు. 11 రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా ప్రయాణించడంతో ముగ్గురూ డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
La Salvamar Nunki ha rescatado esta tarde a tres polizones localizados en la pala del timón del buque Althini II, fondeado en entrediques del puerto de Las Palmas y procedente de Nigeria. Han sido trasladados al puerto y atendidos por servicios sanitarios. pic.twitter.com/1Ei1FieAV3
— SALVAMENTO MARÍTIMO (@salvamentogob) November 28, 2022
ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్తూ సముద్రంలో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి