Pakistan Political Crisis: పాకిస్తాన్‌లో రాజకీయ రసవత్తరంగా మారింది. ఒకవైపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తన కుర్చీని కాపాడుకుని అవిశ్వాస తీర్మానంలో మెజారిటీ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు విపక్షాలు భిన్నమైన వ్యూహాలు రచిస్తున్నాయి. కొత్త ప్రధాని అభ్యర్థి గురించి కొన్ని పార్టీలు చర్చలు కూడా ప్రారంభించాయి. ఈ ఎపిసోడ్‌లో ముందుగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PMLN) ప్రధాని అభ్యర్థిని ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్ తన మెజారిటీని నిరూపించుకోలేక, ప్రభుత్వం పడిపోతే, పీఎంఎల్ఎన్ నాయకుడు షాబాజ్ షరీఫ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఉపాధ్యక్షుడు మరియం నవాజ్ సోమవారం ప్రకటించారు. ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల విలేకరుల సమావేశంలో మరియం మాట్లాడుతూ.. తదుపరి ప్రధాని అభ్యర్థి నియామకంపై ప్రతిపక్షాలు కూర్చుని నిర్ణయం తీసుకుంటాయన్నారు. అయితే, PML N షాబాజ్ షరీఫ్‌ను ప్రధానమంత్రికి నామినేట్ చేస్తుందని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రతిపక్ష నాయకురాలు మరియమ్ మాట్లాడుతూ.. జాతీయ అసెంబ్లీ సమావేశాలను ఆలస్యం చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఆర్టికల్ 6ను అమలు చేస్తామని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా కోర్టుల వైపు కూడా చూస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పరిశీలించేందుకు శుక్రవారం జాతీయ అసెంబ్లీ సమావేశం అవుతోంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది ఎంపీలు మార్చి 8న నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా 172 ఓట్లు వస్తే ఆయన కుర్చీ కోల్పోతారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 155 మంది సభ్యులు ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకోవడానికి 172 ఓట్లు అవసరం.
Read Also…