Saudi Women Garage: మారుతున్న సౌదీ అరేబియా.. ఇలాంటి దృశ్యాలు నెవ్వర్ బిపోర్..!

Saudi Women Garage: ఆంక్షల వలయం నుంచి బయటపడుతోంది సౌదీ మహిళ.. నిన్న కారు స్టీరింగ్‌ పట్టింది.. ఇవాళ ఏకంగా గ్యారేజీలో స్పానర్‌ పట్టుకుంది. సౌదీ అరేబియా కోస్టల్ సిటీ జెడ్డాలో..

Saudi Women Garage: మారుతున్న సౌదీ అరేబియా.. ఇలాంటి దృశ్యాలు నెవ్వర్ బిపోర్..!
Saudi Arabia

Updated on: Jun 04, 2022 | 11:04 AM

Saudi Women Garage: ఆంక్షల వలయం నుంచి బయటపడుతోంది సౌదీ మహిళ.. నిన్న కారు స్టీరింగ్‌ పట్టింది.. ఇవాళ ఏకంగా గ్యారేజీలో స్పానర్‌ పట్టుకుంది. సౌదీ అరేబియా కోస్టల్ సిటీ జెడ్డాలో ఉన్న పెట్రోమిన్ ఎక్స్‌ప్రెస్ ఆటో రిపేర్ గ్యారేజీలో కొందరు మహిళలు కారు బయోనెట్‌ ఎత్తి రిపేర్‌ చేస్తున్నారు. మరికొందరు వాహనం కింద భాగాలను తనిఖీ చేయడంతో బిజీగా ఉన్నారు. వర్క్‌షాప్‌కు వచ్చిన కస్టమర్ల దగ్గర సమస్యలు తెలుసుకొని సరిదిద్దడంలో నిమజ్ఞమైపోయారు. మగవారితో పోటీ పడి మరీ టైర్లను మార్చేస్తున్నారు. ఆయిల్‌ చేంజ్‌ చేస్తున్నారు.

ఇస్లామిక్‌ దేశమైన సౌదీ అరేబియాతో ఇలాంటి దృశ్యాలను ఒకప్పుడు అస్సలు ఊహించుకోలేం. కానీ ఇప్పుడు పూర్తిగా మగాళ్లు పని చేసే ఆటోమొబైట్‌ పరిశ్రమలోకి కూడా ఆడవాళ్లు వచ్చేశారు. మహిళలపై ఉన్న ఆంక్షలు క్రమంగా తొలిగిపోతున్నాయి. ఈ పనులను తాము శ్రమగా భావించడం లేదని.. ఇంట్లో పని చేస్తున్నంత సులభంగా గ్యారేజీలో కూడా చేస్తున్నామని చెబుతున్నారు ఈ మహిళలు. మొదట్లో ఈ పని కొంత కష్టమనిపించినా ఇప్పుడు ఎంతో సులభంగా చేసేస్తున్నామని అంటున్నారు.

సౌదీలో మహిళల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి.. దేశ పాలకుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా ఈ దిశగా చొరవ తీసుకున్నారు.. అప్పటి నుంచి మహిళలు స్వయంగా స్టీరింగ్‌ పట్టి డ్రైవింగ్‌ మొదలు పెట్టారు. కొందరు మహిళలలైతే ఏకంగా స్పీడ్‌ కార్ రేసింగ్‌లో కూడా పాల్గొంటున్నారు.. ఇప్పుడు గ్యారేజీలో రిపేర్లు కూడా చేస్తున్నారు.. ఇది చాలా పెద్ద మార్పే అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

Courtesy from: Al Arabiya English