డాల్ఫీన్లపై బాంబుల వర్షం.. వేల సంఖ్యలో మృత్యువాత.. హృదయవిదారక దృశ్యాలు

|

Jun 19, 2022 | 9:08 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గత 4 నెలలుగా కొనసాగుతోంది. ఇందులో వేలాది మంది చనిపోయారు. మరోవైపు యుద్ధ ప్రభావం ఇతర జీవులపై కూడా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో అనేక వేల డాల్ఫిన్‌లు చనిపోయాయి.

డాల్ఫీన్లపై బాంబుల వర్షం.. వేల సంఖ్యలో మృత్యువాత.. హృదయవిదారక దృశ్యాలు
Killing Dolphins
Follow us on

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గత 4 నెలలుగా కొనసాగుతోంది. ఇందులో వేలాది మంది చనిపోయారు. మరోవైపు యుద్ధ ప్రభావం ఇతర జీవులపై కూడా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో అనేక వేల డాల్ఫిన్‌లు చనిపోయాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ డాల్ఫిన్‌ల మృతదేహాలపై బాంబులు పడటంతో కాలిపోయిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అలా చనిపోయిన కొన్ని డాల్ఫిన్‌ల ఫోటోలు కూడా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉక్రెయిన్, బల్గేరియా, టర్కీ, రొమేనియాతో సహా అనేక దేశాల సరిహద్దులో నల్ల సముద్ర తీరం వెంబడి డాల్ఫిన్స్‌ చచ్చిపడినట్టుగా ఉక్రెయిన్ తుజ్లా ఎస్ట్యూరీస్ నేషనల్ నేచర్ పార్క్ రీసెర్చ్ డైరెక్టర్ ఇవాన్ రుసేవ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. రుసేవ్ షేర్‌ చేసిన ఫోటోల్లో డాల్ఫిన్లు యుద్ధం కారణంగా గాయపడినట్లు చూపించాడు. వాటి శరీరం బాంబుల దాడితో కాలిన గాయాల గుర్తులతో సహా కొట్టుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఈ యుద్ధం కారణంగా బతికున్న డాల్ఫిన్లు కూడా ఆకలికి అలమట్టించి పోతున్నాయని ఈ నివేదికలో వెల్లడించారు. ఇటీవలి వారాల్లో నల్ల సముద్రపు డాల్ఫిన్‌లలో బాంబులు, ఆకలి కారణంగా అనేక మూగజీవాలు మృత్యువాతపడినట్టుగా రేసేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రేసేవ్‌ బృందంతో పాటు యూరప్‌లోని ఇతర పరిశోధకులు సేకరించిన డేటా ఆధారంగా, ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్నప్పుడు అనేక వేల డాల్ఫిన్‌లు ఇప్పటికే చనిపోయాయని వివరించారు. సుమారు 400,000 హెక్టార్లు,14 రామ్‌సర్ సైట్‌లు తీరప్రాంతం,డ్నిప్రో నది దిగువ ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయని ఉక్రెయిన్ పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల డిప్యూటీ మంత్రి ఒలెక్సాండర్ క్రాస్నోలుట్స్కీ తెలిపారు.