Nobel Prize Sells: నోబెల్ శాంతి బహుమతి వేలం పాటలో రికార్డు సృష్టించింది. ఓ జర్నలిస్ట్ తన నోబెల్ బహుమతిని వేలానికి పెట్టాడు. ఈ వేలంలో ఆ నోబెల్ శాంతి బహుమతి సుమారు రూ.800 కోట్లు (103 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. రష్యాకు చెందిన జర్నలిస్ట్ దిమిత్రి మురతోవ్ ఆ బహమతిని వేలం వేశాడు. అయితే ఇంతటి బహుమతిని అతను ఎందుకు వేలం వేశాడో తెలుసా..? ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసమే. గతంలో నోబెల్ బహుమతి వేలం రికార్డులను బద్దలు కొట్టింది. 2014లో జేమ్స్ వాట్సన్ అనే వ్యక్తి తన నోబెల్ బహుమతిని అమ్మకానికి పెట్టారు.1962లో గెలిచిన ఆ బహుమతికి అప్పట్లో అత్యధికంగా 4.76 మిలియన్ల డాలర్లు వచ్చాయి. అక్టోబర్ 2021లో జర్నలిస్ట్ మురతోవ్‌కు ఈ అవార్డు దక్కింది. రష్యాలో స్వతంత్య్ర పత్రిక నొవాయా గెజిటాను ఆయన స్థాపించారు. ఎడిటర్ ఇన్ చీఫ్‌గా చేశారు. అయితే మార్చిలో ఆ పత్రికను మూసివేశారు.
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా తమ దేశంలోని జర్నలిస్ట్‌లపై కొరఢా ఝులిపించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం ఈ నోబెల్ శాంతి బహుమతిని వేలం వేయాలని సదరు జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. 5 లక్షల డాలర్ల డబ్బును, అవార్డును కూడా ఆయన ఛారిటీకి ఇచ్చేశారు. శరణార్థి పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. అయితే ముతోవ్‌కు అందజేసిన నోబెల్ ప్రైజ్‌లో 23 క్యారెట్లకు చెందిన 175 గ్రాముల బంగారం ఉంటుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి