Russia: సముద్రంలో కెమెరామెన్‌ను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన ఆ దేశ మంత్రి

Russia: రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రి యెవ్జెనీ జినిచెవ్ (55) దురదృష్టవశాత్తూ మరణించారు. ఆర్కిటిక్ మహా సముద్ర పరిధిలో స్ట్రాటజిక్ సివిల్ డిఫెన్స్, మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తుండగా..

Russia: సముద్రంలో కెమెరామెన్‌ను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన ఆ దేశ మంత్రి
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2021 | 8:06 PM

Russia: రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రి యెవ్జెనీ జినిచెవ్ (55) దురదృష్టవశాత్తూ మరణించారు. ఆర్కిటిక్ మహా సముద్ర పరిధిలో స్ట్రాటజిక్ సివిల్ డిఫెన్స్, మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇన్సిడెంట్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. ఆర్కిటిక్ జోన్ నోరిల్స్క్ ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ కోసం ట్రైనింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను రష్యన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ మినిస్టర్ జినిచెవ్ పర్యవేక్షిస్తున్నారు. సముద్రంలో జరుగుతున్న ట్రైనింగ్ సెషన్‌ను వీడియో షూట్ చేస్తుండగా ఓ కెమెరామెన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడు. నీళ్లల్లో పడిపోయిన ఆ వ్యక్తిని కాపాడేందుకు సముద్ర జలాల్లోకి దూకారు మంత్రి యెవ్జెనీ జినిచెవ్. ఆ తర్వాత జనిదెవ్ జాడ లభించలేదు. ఈ ఘటనలో నీళ్లల్లో పడిపోయిన కెమెరామెన్ కూడా మృతిచెందాడు. సోల్జర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎంత వెదికినా ఇద్దరి ఆచూకీ తెలియలేదు.

కాగా, స్ట్రాటజిక్ మిలటరీ డ్రిల్స్‌ను కవర్ చేస్తోన్న సమయంలో ఆ ఫొటోగ్రాఫర్ ప్రమాదావశావత్తూ నీటిలో పడిపోతుండగా.. ఆయన చెయ్యిని పట్టుకుని మంత్రి జినిచెవ్ పైకి లాగే ప్రయత్నం చేశారని, పట్టు తప్పి కిందికి పడిపోయారని అధికారులు వెల్లడించారు. జినిచెవ్ ఆకస్మిక మృతితో మిలటరీ డ్రిల్స్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నొరిల్స్క్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, సమాచారం తెలుసుకున్న వేర్వేరు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జినిచెవ్‌ మృతి పట్ల వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వస్థలంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ చేస్తున్నారు. ఓ కెమెరామెన్ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన జినిచెవ్‌ను హీరోగా అభివర్ణిస్తోన్నారు.

ఇవీ కూడా చదవండి:

Indian Railways: ఆలస్యంగా చేరుకున్న రైలు.. రూ.30వేల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం

GST Tax Payers: పన్ను చెల్లింపుదారులకు షాకిచ్చిన కేంద్ర సర్కార్‌.. సెప్టెంబరు 10లోగా దాఖలు చేయండి