Russia Ukraine War: రష్యా తగ్గనంటోంది. అంతర్జాతీయ చట్టాల బేఖాతర్‌.. ఇంటర్నేషనల్‌ కోర్టు విచారణకు డుమ్మా!

|

Mar 08, 2022 | 8:50 AM

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన విచారణను లైట్‌ తీసుకుంది రష్యా. ఆ దేశం తరఫున న్యాయవాదులెవరూ కోర్టుకు రాలేదు. ది హేగ్​లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్​లో రష్యా న్యాయవాదుల కోసం కేటాయించిన సీట్లు ఖాళీగా కనిపించాయి.

Russia Ukraine War: రష్యా తగ్గనంటోంది. అంతర్జాతీయ చట్టాల బేఖాతర్‌.. ఇంటర్నేషనల్‌ కోర్టు విచారణకు డుమ్మా!
Russia Ukraine War
Follow us on

Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితి(UNO) ఆధ్వర్యంలోని అంతర్జాతీయ న్యాయస్థానం(International Court)లో జరిగిన విచారణను లైట్‌ తీసుకుంది రష్యా. ఆ దేశం తరఫున న్యాయవాదులెవరూ కోర్టుకు రాలేదు. ది హేగ్​లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్​లో రష్యా న్యాయవాదుల కోసం కేటాయించిన సీట్లు ఖాళీగా కనిపించాయి. చెప్పినట్టుగానే విచారణ ప్రారంభమైనప్పటికీ.. రష్యా తరఫున ఎవరూ రాలేదు. విచారణలో పాల్గొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని నెదర్లాండ్స్​లోని రష్యా రాయబారి సమాచారం అందించారని కోర్టుకు అధ్యక్షత వహిస్తున్న అమెరికా(America) న్యాయమూర్తి జోన్ ఈ డొనోగూ చెప్పారు. దీంతో రష్యా బృందాలు లేకుండానే విచారణ కొనసాగింది.

రష్యా ఆక్రమణను అడ్డుకోవాలంటూ ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రెండు రోజుల విచారణను ప్రారంభించింది అంతర్జాతీయ న్యాయస్థానం. నిన్న ఉక్రెయిన్ ప్రతినిధులు తమ వాదన వినిపించగా.. రష్యా న్యాయవాదులకు నేడు అవకాశం ఇవ్వనున్నారు. కొద్దిరోజుల పరిశీలన తర్వాత కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. రష్యా వీటిని పాటించే అవకాశాలు తక్కువ. అయితే, కోర్టు ఫలితంతో సంబంధం లేకుండా రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఉక్రెయిన్ ఈ కేసు వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, రష్యాకు వ్యతిరేకంగా రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. రష్యా ఆగడాలకు వ్యతిరేకంగా రాజకీయ మద్దతును కూడగట్టే ప్రణాళికలను ప్రారంభించారు బ్రిటన్‌ ప్రధాని. ఇదే విషయంపై వారం రోజుల పాటు ప్రపంచ నేతలతో బోరిస్ చర్చించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

Read Also….

Russia Ukraine War Live: మూడో దఫా శాంతి చర్చలు విఫలం.. ఉక్రెయిన్ దాడిలో రష్యా జనరల్ విటాలీ గెరాసిమోవ్ మృతి