Russia Ukraine War: సైనిక స్థావరమే లక్ష్యంగా రష్యా దాడి.. 50 మందికి పైగా ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది మృతి

|

Mar 19, 2022 | 9:25 PM

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 24 వ రోజుకు చేరింది. రష్యా దళాలు మైకోలైవ్‌లోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ ఉక్రెయిన్ సైనికులు మరణించారు.

Russia Ukraine War: సైనిక స్థావరమే లక్ష్యంగా రష్యా దాడి.. 50 మందికి పైగా ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది మృతి
Russia Ukraine
Follow us on

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 24 వ రోజుకు చేరింది. రష్యా దళాలు మైకోలైవ్‌(Mykolaiv)లోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ ఉక్రెయిన్ సైనికులు(Ukraine Army) మరణించారు. ఈ మేరకు వార్తా సంస్థ AFP వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన 22 ఏళ్ల సైనికుడు, మాగ్జిమ్, శుక్రవారం రష్యా సైన్యం దాడి చేసినప్పుడు, ఆ సమయంలో సుమారు 200 మంది ఉక్రేనియన్లు బ్యారక్‌లో నిద్రిస్తున్నారని చెప్పారు. బ్యారక్ నుంచి ఇప్పటివరకు 50 మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. అయితే బ్యారక్‌లో శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకుపోయారో ఇంకా తెలియరాలేదు.

రష్యా దాడిలో దాదాపు 100 మంది మరణించి ఉండవచ్చని మరో సైనికుడు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రష్యా దాడి చేసిన ప్రదేశం సైనిక సదుపాయంగా ఉంది. ఈ సైనిక సదుపాయం ఉక్రెయిన్‌కు ఉత్తరాన మైకోలైవ్ నగరంలో ఉంది. రష్యా క్షిపణి దాడుల కారణంగా ఈ నగరం పూర్తిగా ధ్వంసమైంది. మైకోలైవ్ నగరం నల్ల సముద్ర తీరం నుండి వ్యూహాత్మక ఓడరేవు నగరమైన ఒడెస్సాకు వెళ్లే మార్గంలో దాదాపు 130 కి.మీ దూరంలో ఉంది.


అదే సమయంలో, మరొక సంఘటనలో, కైవ్ సమీపంలో ఉన్న మకరోవ్ నగరంలో రష్యా సైన్యం మోర్టార్ దాడిలో కనీసం ఏడుగురు మరణించారు. కాగా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపారు. శత్రువుల షెల్లింగ్ కారణంగా మకరోవ్‌లో ఏడుగురు పౌరులు మరణించారని స్థానిక పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, రష్యా పౌరులను టార్గెట్ చేయడాన్ని నిర్ద్వంద్వంగా ఖండించింది. రష్యా దండయాత్ర తర్వాత 3.3 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టడం గమనార్హం. దేశంలో దాదాపు 6.5 మిలియన్ల మంది ప్రజలు అంతర్గతంగా నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది.

ఉక్రెయిన్ రష్యాల మధ్య ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3,328,692 మంది ఉక్రేనియన్లు వలస వెళ్లిపోయారని UN శరణార్థుల ఏజెన్సీ UNHCR తెలిపింది. బాంబులు, వైమానిక దాడులు, విచక్షణారహిత విధ్వంసానికి భయపడి ప్రజలు ఉక్రెయిన్ నుంచి పారిపోతున్నారని UNHCR చీఫ్ ఫిలిప్పో గ్రాండి అన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నేరుగా కలవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ‘ఇది కలిసే సమయం. ఇది మాట్లాడటానికి సమయం. ప్రతి ఒక్కరూ నా మాట వినాలని నేను కోరుకుంటున్నాను, ముఖ్యంగా మాస్కోలో. దేశానికి తన వీడియో సందేశంలో, జెలెన్‌స్కీ అన్నారు. “రష్యన్ దళాలు పెద్ద నగరాలను చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ పౌరులు వారికి సహకరించాల్సిన అటువంటి దయనీయమైన పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే, ఈ వ్యూహం విజయవంతం కాదు. రష్యా యుద్ధాన్ని ముగించకపోతే, అది దీర్ఘకాలంలో నష్టపోతుందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

Read Also…  Crime news: కన్న తండ్రి అని కూడా చూడకుండా.. పారతో కొట్టి చంపాడు.. విచారణలో షాకింగ్ విషయాలు