War Effect: దాణా లేక మూగరోదన.. పశువులకు తిండిపెట్టలేక ఏం చేస్తున్నారో తెలుసా

|

Mar 19, 2022 | 5:18 PM

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Ukraine-Russia war) చేపట్టి రోజులు గడుస్తున్నా ప్రస్తుతానికి దీనికి ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేక బిక్కుబిక్కుమంటూ..

War Effect: దాణా లేక మూగరోదన.. పశువులకు తిండిపెట్టలేక ఏం చేస్తున్నారో తెలుసా
Cattle
Follow us on

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Ukraine-Russia war) చేపట్టి రోజులు గడుస్తున్నా ప్రస్తుతానికి దీనికి ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటి వరకు యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌, రష్యాలు ఎక్కువ ప్రభావితం కాగా.. ఇప్పుడు దక్షిణ యూరప్‌కు (South Europe) కష్టాలు ప్రారంభమయ్యాయి. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు అధికంగా మాంసాహారం తినేందుకు ఇష్టపడుతుంటారు. అక్కడి ప్రజల ఆహార అలవాట్లలో చికెన్‌, మటన్‌, బీఫ్‌, పోర్క్‌లు చెప్పుకోదగినవి. డిమాండ్‌కు తగ్గట్టుగా యూరప్‌లో భారీగా పశువుల పెంపకం జురుగుతుంది. లైవ్‌స్టాక్‌కి (Life Stock) ఆహారంగా అందించే దినుసుల్లో మొక్కజొన్న గింజలు ప్రధానం, యూరప్‌ దేశాల్లోని లైవ్‌స్టాక్‌కి సరఫరా అయ్యే మొక్కజొన్నలో అత్యధిక భాగం ఉక్రెయిన్‌ నుంచే సరఫరా అవుతుంది. కానీ ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఓడరేవుల నుంచి షిప్‌లు కదలడం లేదు.

యుద్ధం మొదలై ఇప్పటికే 20 రోజులు దాటి పోయాయి. మళ్లీ స్టాక్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లైవ్‌స్టాక్‌ను మెయింటైన్‌ చేయలేక ఫార్మ్స్‌ యజమానులు వాటిని ఉన్న పళంగా కబేళాలకు తరలిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు స్పెయిన్‌ తాత్కాలికంగా బ్రెజిల్‌, అర్జెంటీనాల నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవాలని ప్రయత్సిస్తోంది. మరో వారం పది రోజుల్లో యుద్ధం విషయంలో క్లారిటీ రాకపోతే పశువులను పెంచలేని పరిస్థితి నెలకొంటుందని.. అదే పరిస్థితి వస్తే ఆఖరికి డెయిరీ పరిశ్రమలో ఉన్న పశువులను సైతం కబేళాలకు తరలించాల్సిన వస్తుందంటున్నారు అక్కడి లైవ్‌స్టాక్‌ ఫార్మ్‌ నిర్వాహకులు.

Also Read

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

UP MLC Elections: యూపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. 30 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Tirumala: శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కు.. వినూత్న ఫార్ములాతో చెక్ పెట్టిన టీటీడీ