Russia-Ukraine War: రష్యా – ఉక్రెయిన్‌ వార్.. ఆగమైపోతున్న పేద దేశాలు.. తిండి కూడా దొరకని పరిస్థితి..

|

Jun 01, 2022 | 9:59 AM

Russia-Ukraine War: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం.. ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచింది.

Russia-Ukraine War: రష్యా - ఉక్రెయిన్‌ వార్.. ఆగమైపోతున్న పేద దేశాలు.. తిండి కూడా దొరకని పరిస్థితి..
Russia China
Follow us on

Russia-Ukraine War: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం.. ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచింది. అసలే కరువుతో అల్లాడుతున్న ఈ దేశాల్లో ఈ యుద్ధం కారణంగా ధాన్యం కొరత ఏర్పడింది. వాస్తవానికి ఆఫ్రికన్ దేశాలకు 44 శాతం గోధుమలు రష్యా, ఉక్రెయిన్‌ నుంచే వస్తాయి. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఎరువులు దిగుమతి అవుతాయి. రష్యాపై వత్తిడి పెంచేందుకు అమెరికా, నాటోలు విధించిన ఆంక్షలు ఆఫ్రికన్‌ దేశాలకు శాపంగా మారింది. ఎరువులు నిలిచిపోవడంతో ఆహారోత్పత్తి పడిపోయింది. గోధుమల ధరలు, వంట నూనెల ధరలు రెండు మూడింతలు పెరిగిపోయాయి. తమపై ఆంక్షల కారణంగా ఈ దేశాలకు గోధుమలు, ఎరువులు పంపలేకపోతున్నామని రష్యా ప్రకటించింది.

సోమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా, కెన్యా, సాహెల్‌ దేశాల్లో తీవ్ర అనావృష్టి కారణంగా 3 కోట్ల మంది ఆకలి భారిన పడే ప్రమాదం ఉందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఎరువుల ధరలు 300 శాతం పెరగడంతో ఈ ఏడాది ఆహారోత్పత్తి 20 శాతం తగ్గిపోతుందని ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు తెలిపింది. ఆఫ్రికన్లు తమ ఆహార అలవాట్లను మార్చుకోవడం కూడా ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆఫ్రికన్‌ యూనియన్‌ చైర్మన్‌ మెకీ సాల్‌ అంటున్నారు. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు తిన్న దేశాలు ఇప్పుడు విదేశాల నుంచి బియ్యం, గోధుమలు దిగుమతి చేసుకోవడాన్ని గుర్తు చేశారాయన.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ప్రస్తుత సంక్షభం నుంచి బయట పడేందుకు కొంత మేర అవకాశం ఉంటుందని తెలిపారు మెకీ సాల్‌.