Russia Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు నెల రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్‌పై దాడులను చేస్తోంది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో భారీ విధ్వంసం సృష్టించింది. రష్యా సైన్యం దాడికి ఉక్రెయిన్ సైన్యం (Attacks In Ukraine) తోపాటు సాధారణ ప్రజలు సైతం చాలా నష్టపోయారు. ఉక్రెయిన్‌లో అనేక భవనాలు నెలమట్టమయ్యాయి. ప్రజలు ఇప్పుడు ఆహారం కోసం అలమటిస్తున్నారు. అయితే.. ఉక్రెయిన్ కూడా రష్యా దాడులను పూర్తిగా తిప్పికొడుతోంది. చాలామంది రష్యన్ సైనికులను చంపినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది. అయితే.. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశం భారీగా నష్టపోయింది. ఎంత మంది ప్రజలు దీని బారిన పడ్డారు అనేది ప్రశ్నగా మారింది. ఈ యుద్దంలో ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ఎంతమంది మరణించారు. అదేవిధంగా రష్యా ఎంతమంది సైనికులను కోల్పోయింది అనేది ప్రశ్నగా మారింది. అయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం 28 రోజుల నుంచి ఇరుదేశాల్లో ప్రాణ, ఆస్థి నష్టం ఎంత మేర జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉక్రెయిన్‌లో ఎంత నష్టం జరిగిందంటే..?
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నాటి నుంచి వేర్వేరు విషయాలు, గణాంకాలు బయటకు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, మీడియా నివేదికలు, ఉక్రేనియన్ అధికారులు, దీంతోపాటు అమెరికా నుంచి పలు రకాల గణాంకాలు వస్తున్నాయి. రష్యా దాడి వల్ల ఉక్రెయిన్‌లో 1,000 భవనాలు కూలిపోయాయి. కనీసం 3,000 మంది మరణించినట్లు చెబుతున్నారు. రష్యా నిరంతరం చేస్తున్న దాడులతో ఉక్రేనియన్ నగరం మారియుపోల్‌పై తీవ్ర ప్రభావం పడింది. నగరంలో ఇప్పటివరకు దాదాపు 1,000 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
మారియుపోల్‌లోని ఆసుపత్రులు, పాఠశాలలు కూడా నెలమట్టమయ్యాయి. మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలు విద్యుత్, నీరు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. రష్యా దాడి చేసిన డజన్ల కొద్దీ నగరాల్లో మారియుపోల్ తీవ్రంగా నష్టపోయింది. నిజానికి, కీవ్‌పై రష్యా వైఫల్యం తర్వాత మారియుపోల్ నగరంపై దాడి జరుగుతోంది. వేలాది మంది పౌరులు బందీలుగా ఉన్నారు. మారియుపోల్ నుంచి ప్రజలను బలవంతంగా రష్యాకు పంపుతున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్ సైనికుల సంఖ్య గురించి వేర్వేరు గణాంకాలు వస్తున్నాయి. దాదాపు 5000 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించారని పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 117 మంది అమాయకులు మరణించగా, 155 మంది చిన్నారులు గాయపడ్డారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇక్కడి నుంచి 3.5 మిలియన్లకు పైగా ప్రజలు పారిపోయారు. వారంతా చుట్టుపక్కల దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ పోరాటంలో కనీసం 902 మంది పౌరులు మరణించారని, 1,459 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ తెలిపారు.
అయితే, హైకమిషనర్ కార్యాలయం.. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని చెబుతోంది. ఒక్క నగరంలోనే 2,400 మందికి పైగా మరణించినట్లు మారియుపోల్ అధికారులు పేర్కొన్నారు. పౌరులు, సైనికుల హత్యల గురించి రెండు దేశాలు వేర్వేరు వాదనలు చేస్తున్నాయి.
రష్యా ఎంతమేర నష్టపోయిందంటే..?
ఉక్రెయిన్ ప్రకారం.. ఇప్పటివరకు 15,300 మంది రష్యా సైనికులు మరణించారు. రష్యాకు చెందిన 252 ఫిరంగి వ్యవస్థలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. దీంతోపాటు 509 రష్యన్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసింది. అయితే.. 123 హెలికాప్టర్లు, 99 ఫైటర్ జెట్‌లు, 80 MLRS, 45 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్.. రష్యా సైన్యాన్ని నిరుత్సాహపరిచే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి గణాంకాలను విడుదల చేస్తోందని.. పేర్కొంటోంది రష్యా.
ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు 9861 మంది రష్యా సైనికులు మరణించారని, 27 రోజుల యుద్ధంలో 16153 మంది గాయపడ్డారని రష్యా అంచనా వేసింది. అయితే కొద్ది రోజుల క్రితం రష్యా తన 500 మంది సైనికుల మృతి గురించి మాత్రమే మాట్లాడగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 10 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.
Also Read: