Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. పలు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. చాలా ప్రాంతాల్లో నివాస గృహాలే లక్ష్యంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా.. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో రష్యా చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వీరిలో ఇద్దరు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మానవత్వాన్ని మంటగలుపుతూ గత రాత్రి రష్యన్ సైన్యం సుమీలో మారణ హోమానికి పాల్పడినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా నివాస భవనాలపై 500 కిలోల బాంబు వేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారంటూ అంటూ ఉక్రెయిన్ ట్విటర్ వేదికగా తెలిపింది.
దీంతోపాటు చెర్నివిహ్‌లోని ఓ భవనంపై రష్యా సైన్యం ఇదే తరహా దాడికి పాల్పడగా.. అదృష్టవశాత్తూ ఆ బాంబు పేలలేదు. కాగా ఆ బాంబు ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా ట్విటర్‌లో షేర్ చేసి రష్యా తీరును ఖండించారు. అత్యంత ప్రమాదకరమైన 500 కిలలో బాంబును ఓ నివాస భవనంపై వేశారు.. కానీ అది పేలలేదు. రష్యా ఇలాంటి అనేక దాడులను చేస్తూ అమాయక ప్రజలు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటోంది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL
— Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022
రష్యా నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడాలని, గగనతలాన్ని మూసివేయాలంటూ ఆయన కోరారు. యుద్ధ విమానాలను కూడా అందించాలంటూ ప్రాథేయపడ్డారు. ఇదిలాఉంటే.. మూడో విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యా.. ప్రధాన నగరాల్లోని ప్రజలంతా వెళ్లాలని సూచనలు చేసింది. దీంతోపాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది.
Also Read: