Russia-Ukraine crisis: ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలం.. ఉక్రెయిన్ రాజధానిపై రష్యా బాంబుల వర్షం

|

Feb 24, 2022 | 9:45 AM

ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి.  ఉక్రెయిన్‌, రష్యా మధ్య వార్ మొదలైంది. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతుంది రష్యా.

Russia-Ukraine crisis:  ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలం.. ఉక్రెయిన్ రాజధానిపై రష్యా బాంబుల వర్షం
Ukraine Russia War
Follow us on

Russia begins military operation: ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి.  ఉక్రెయిన్‌, రష్యా మధ్య వార్ మొదలైంది. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతుంది రష్యా. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై మొదట ఫోకస్ పెట్టింది రష్యా. ఇప్పటికే మిలటరీ ఆపరేషన్( military operation) మొదలైందని పుతిన్( Vladimir Putin) స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలు ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే ‘ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది’ హెచ్చరికలు పంపారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు. కాగా  ఉక్రెయిన్‌లో నాలుగుచోట్ల మిస్సైల్ ఎటాక్స్‌ చేసింది రష్యా. డాడ్‌బస్‌లోకి రష్యా మిలటరీ చొచ్చుకెళ్లింది. ఉక్రెయిన్‌పై మూడువైపుల నుంచి దాడి ప్రారంభించింది రష్యా. త్రిశూలవ్యూహంతో ఉక్రెయిన్‌ని చుట్టేసింది. నాటో, అమెరికా దేశాల హెచ్చరికలు రష్యా బేఖాతర్ చేసింది. ఉక్రెయిన్ – రష్యా మధ్య ఉద్రిక్తతతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.

పుతిన్ ప్రకటనపై స్పందించిన అమెరికా….

పుతిన్ ప్రకటనపై అమెరికా వెంటనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనికి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

Also Read: ఈ ఫోటోలో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.. ఎవరో గుర్తించారా..?