Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రజాస్వామ్యానికి సవాలుగా పేర్కొంటూ ఉక్రెయిన్ ప్రభుత్వానికి 8.7 మిలియన్ డాలర్లు విరాళంగా అందజేస్తానని జపాన్(Japan) బిలియనీర్ హిరోషి మిక్కీ మికిటాని(Hiroshi Mikitani) ఆదివారం తెలిపారు. 1 బిలియన్ యెన్ ($8.7 మిలియన్లు) విరాళం ఉక్రెయిన్‌లో హింసకు గురైన వ్యక్తులకు సహాయం చేయడానికి మానవతా కార్యకలాపాలకు వినియోగించాలని ఇ-కామర్స్ దిగ్గజం రకుటెన్ వ్యవస్థాపకుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి రాసిన లేఖలో తెలిపారు.
తాను 2019లో కైవ్‌ను సందర్శించి జెలెన్‌స్కీని కలిశానని మికితాని తెలిపారు. “నా ఆలోచనలు ఉక్రెయిన్ ప్రజలతో ఉన్నాయి” అంటూ మికిటాని తన లేఖలో పేర్కొన్నారు. “శాంతియుత, ప్రజాస్వామ్య యుక్రెయిన్‌ను అన్యాయమైన శక్తితో తొక్కడం ప్రజాస్వామ్యానికి సవాలు అని అయన అన్నారు. రష్యా, ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించగలవని అశిస్తున్నానన్నారు. ఉక్రెయిన్ ప్రజలు వీలైనంత త్వరగా శాంతిని పొందగలరని ఆయన లేఖలో పేర్కొన్నారు.
僕達にできることは本当に限られていますが、家族と相談し10億円をウクライナに寄付することにしました。
Consulting with my family, we Mikitani family have decided to donate 1 billion yen to Ukraine.
Attached is my letter to President Zaranskyy. Our hearts are with you. pic.twitter.com/w4LAPs7nt7— 三木谷浩史 Hiroshi (Mickey) Mikitani (@hmikitani) February 26, 2022
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు.. రష్యాపై విస్తృత ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి విరాళాలను అభ్యర్థించాయి. జపాన్ ప్రభుత్వం రష్యా ఆస్తులను స్తంభింపజేయడం, రష్యన్ మిలిటరీకి సంబంధించిన సంస్థలకు సెమీకండక్టర్స్ వంటి కీలక ఎగుమతులను నిషేధించడంతో సహా ఆంక్షలను ప్రకటించింది.
ఇదిలావుంటే, ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’కు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కూడా తన గుప్పిట్లోకి తీసుకుంటున్నది. అయితే, సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించగానే అమెరికా, పశ్చిమ దేశాలూ హెచ్చరికలు చేశాయి. మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలను రష్యాపై విధిస్తామని ప్రకటించాయి. రష్యా దాడిని దాదాపు మేజర్ ఎకానమీ దేశాలు ఖండించాయి. ఒక్క చైనా మాత్రమే స్పష్టంగా ఖండించలేదు. ఈ రెండు దేశాలకు దగ్గరి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ దేశాలు విధించే ఆర్థిక ఆంక్షలను తట్టుకోవడానికి రష్యాకు చైనా ఒక ఆశాదీపంగా కనిపిస్తోంది. అయితే, నిజంగానే చైనా.. రష్యాను ఆదుకుంటుందా? రష్యాను ఆదుకోవడానికి ఉపక్రమించి అమెరికా, పశ్చిమ దేశాల్లోని మార్కెట్‌ను పోగొట్టుకునే రిస్క్ చేస్తుందా? అనేది కొంత చర్చనీయాంశంగా మారింది.
Read Also…