Afghanistan Crisis: ఇరాక్-సిరియా తీవ్రవాదులకు అడ్డగా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన!

యుద్ధంలో నైపుణ్యం సాధించిన ఇరాకీ.. సిరియన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

Afghanistan Crisis: ఇరాక్-సిరియా తీవ్రవాదులకు అడ్డగా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన!
Putin

Updated on: Oct 15, 2021 | 8:54 AM

Afghanistan Crisis: యుద్ధంలో నైపుణ్యం సాధించిన ఇరాకీ.. సిరియన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాజీ సోవియట్ స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ చీఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి సాధారణమైనది కాదాని ఆయన చెప్పారు. సైనిక కార్యకలాపాలలో నైపుణ్యం ఉన్న ఇరాక్.. సిరియా నుండి తీవ్రవాదులు ఇక్కడ వేగంగా చొరబడుతున్నారని.. దీనిని అడ్డుకోవలసిన అవసరం ఉందనీ ఆయన పేర్కొన్నారు.

పొరుగు దేశాలలో కూడా అస్థిరతను సృష్టించడానికి ఉగ్రవాదులు ప్రయత్నించవచ్చనే ఆందోళనలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఉగ్రవాదులు నేరుగా సరిహద్దును విస్తరించడానికి ప్రయత్నించవచ్చని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రవాద గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. వారి లక్ష్యం ఆఫ్ఘన్ శరణార్థిగా మారడంతరువాత మాజీ సోవియట్ దేశాలలోకి ప్రవేశించడంగా ఉందని ఆయన చెప్పుకొస్తున్నారు. .

మధ్య ఆసియాలో అస్థిరత ముప్పు గురించి రష్యా ఆందోళన..

ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త తాలిబాన్ ప్రభుత్వం పట్ల రష్యా వైఖరి సానుకూలంగా ఉం. అయితే రష్యా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత గురించి ఆందోళన చెందుతోంది. రష్యా తన సైనిక స్థావరాలను కలిగి ఉన్న మధ్య ఆసియాకు కూడా ఈ అస్థిరత వ్యాప్తి చెందుతుందని రష్యా భయపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ తరువాత, సోవియట్ యూనియన్‌లో భాగమైన తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో రష్యా సైనిక కసరత్తులు నిర్వహించింది. రెండు దేశాలు ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దులను పంచుకుంటాయి.

ఆఫ్ఘనిస్తాన్ నుండి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పెరుగుతోంది

తజికిస్తాన్ జాతీయ భద్రతా చీఫ్ సముమిన్ యెతిమోవ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తన దేశంలోకి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలు పెరుగుతున్నట్లు గమనించినట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ చాలా కాలంగా ప్రపంచంలోనే అపరాల, హెరాయిన్ ఉత్పత్తిదారు. ఈ అక్రమ వ్యాపారం నుండి వచ్చే లాభాలకు తాలిబాన్ నిధులు సమకూర్చింది.

అంతకుముందు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారిస్‌లో తజికిస్తాన్ నాయకురాలు ఇమామాలి రఖ్‌మోన్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో, ఇరువురు నాయకులు మధ్య ఆసియాలో స్థిరత్వాన్ని కాపాడేండుకు చేయాల్సిన కృషి గురించి చర్చలు జరిగాయి.

Also Read: Dussehra 2021: పాల పిట్ట దర్శనంతో ముగిసే దసరా ఉత్సవాలు.. ఎందుకు దర్శిస్తారంటే..

Mysore Palace: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్న ప్యాలెస్‌