Russia : అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పిల్లలు.. సాహసంతో రక్షించిన ముగ్గురు వ్యక్తులు

|

Jun 15, 2021 | 5:16 PM

Russia : ఓ అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను రక్షించడానికి ఒక గొలుసుగా ఏర్పడి రక్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన రష్యాలో...

Russia : అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పిల్లలు.. సాహసంతో రక్షించిన ముగ్గురు వ్యక్తులు
Russia
Follow us on

Russia : ఓ అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను రక్షించడానికి ఒక గొలుసుగా ఏర్పడి రక్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

వెనిజియా జిల్లాలో ఓ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. నుండి పిల్లలను రక్షించారు. 62 వ ఇంట్లో చిక్కుకున్న పిల్లలను రక్షించడానికి ముగ్గురు వ్యక్తులు డ్రెయిన్ పైప్ ఎక్కారు. కిటికీ ద్వారా ఇంట్లోకి చేరుకొని ముగ్గురు పిల్లల్ని రక్షించారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం చేసుకుంది. మొదట మంచానికి నిప్పు అంటుకుని తర్వాత ఇల్లంతా వ్యాపినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మంటల్లో చిక్కుకున్న పిలలల్ని రక్షించడానికి మొదట తలుపులను పగలగొట్టడానికి ప్రయత్నించారని.. అయితే ప్రయత్నం విఫలం కావడంతో కిటికీ నుంచి పిలలల్ని రక్షించారని అధికారులు తెలిపారు.

మంటలతో దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలల్లో చుట్టుముట్టాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు మూడవ అంతస్తు వరకు డ్రెయిన్ పైప్ సహాయంతో ఎక్కాయారు. మరో ఇద్దరు సహాయం కోసం మెట్ల మీద వేచి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి రాకముందే పిల్లలను రక్షించారు. పిల్లల తల్లి నాల్గవ బిడ్డతో షికారుకు వెళ్లిందని, పిల్లలను తన భర్తతో విడిచిపెట్టిందని చెప్పారు. అపార్ట్ మెంట్ ను బయటి నుండి లాక్ చేసి తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్లాడని ప్రాంతీయ అత్యవసర సేవల ప్రతినిధి చెప్పారు. ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో తండ్రి తిరిగి రాలేదు.

ఇన్వెస్టిగేటివ్ కమిటీ యొక్క రష్యా యొక్క ప్రాంతీయ ప్రధాన కార్యాలయం అపార్ట్మెంట్లోని అగ్ని నిరోధక వ్యవస్థలు మరియు నిర్లక్ష్యం యొక్క సంభావ్యతపై దర్యాప్తును ప్రారంభించింది. ముగ్గురు పిల్లలని దైర్యంగా రక్షించిన వ్యక్తులపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

Also Read: Dattatreya Temple:అక్కడ ఆలయంలో రోజూ ప్రసాదం తినడానికి వచ్చే నక్కలు.. వింత చూడడనికి భారీగా భక్తులు