AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా అధ్యక్షుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న నావల్నీ, టాయిలెట్‌బ్రష్‌లు, బ్లూ అండర్వేర్‌లతో ఆందోళనకారుల నిరసన

అలెక్సీ నావెల్నీ... రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ సోషల్‌ క్రిటిక్‌ను ఇప్పుడు జైలుకు తరలించారు. ఆయనకు దాదాపు..

రష్యా అధ్యక్షుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న నావల్నీ, టాయిలెట్‌బ్రష్‌లు, బ్లూ అండర్వేర్‌లతో ఆందోళనకారుల నిరసన
Venkata Narayana
|

Updated on: Feb 04, 2021 | 5:52 AM

Share

అలెక్సీ నావెల్నీ… రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ సోషల్‌ క్రిటిక్‌ను ఇప్పుడు జైలుకు తరలించారు. ఆయనకు దాదాపు మూడున్నరేళ్ల జైలుశిక్షను విధించారు. అతడికి విధించిన పెరోల్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఫలితంగా యావత్ రష్యా గర్జిస్తోంది. క్రెమ్లిన్‌ క్రిటిక్‌… నావల్నీని వదిలేయాలని నినదిస్తోంది. ఇప్పటికే తాను హౌస్‌ అరెస్టులో ఉన్నా కాబట్టి.. తన శిక్ష తగ్గుతుందని నావల్నీ అంటున్నాడు. కాని పుతిన్‌ మాత్రం నావల్నీని వదిలే స్థితిలో లేడు. నావల్నీ జనవరి 17న జర్మనీ నుంచి తిరిగివచ్చాడు. దీంతో దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఆతర్వాత ఈశిక్షను విధించారు.

ఇప్పటికే రష్యా సైన్యం తనను చంపేందుకు ప్రయత్నాలు చేసిందని నావల్నీ ఆరోపించాడు. తన అండర్‌వేర్‌లో నెర్వ్‌ ఏజెంట్‌ను ఉంచి చంపేందుకు ప్రయత్నించినట్లు సంచలన విషయాలను వెల్లడించాడు. ఇదంతా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించిన రహస్య ప్యాలెస్‌ గురించి బయటపెట్టినందుకేనన్నారు నావల్నీ. పుతిన్‌ ప్యాలెస్‌లో బంగారం హ్యాండిల్‌ ఉన్న టాయిలెట్‌ బ్రష్‌ విలువ 50వేల రూపాయలు ఉంటుందని ఇక ప్యాలెస్‌లో ఒక్కోగది గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు. ఇప్పుడు రష్యా వ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. నావల్నీని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. టాయిలెట్‌ బ్రష్‌, బ్లూ అండర్వేర్‌లతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ఇక మాస్కో కోర్టులో విచారణ జరుగుతున్నంత సేపు నావల్నీ తన భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. హార్ట్‌ సింబల్స్‌ చూపిస్తూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. మరో రెండేళ్లకు పైగా జైలు జీవితం గడపాల్సి ఉండగా.. నావల్నీ సంకేతాలు అందరికీ కన్నీటిని తెప్పించింది. ఇక జైల్లో నావల్నీని చంపేస్తారని అతడి మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతడిని చంపాలన్న కుట్రలు జరిగాయని.. జైల్లో చంపేయడం ఖాయం అంటున్నారు.

కాకులు, కోళ్లు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదులుతున్నాయ్, కుక్కల పరిస్థితి మరీ దారుణం.. పశుపక్షాదుల స్మశానంగా ఆ ఊరు

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌