Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!

|

Nov 25, 2021 | 4:56 PM

రష్యాలోని సైబీరియాలోని బొగ్గు గనిలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో పైకప్పు కూలిన ఘటనలో కనీసం 11 మంది ప్రాణాలను కోల్పోయారు.

Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!
Siberia Coal Mine Accident
Follow us on

Russia Coal Mine Accident: రష్యాలోని సైబీరియాలోని బొగ్గు గనిలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో పైకప్పు కూలిన ఘటనలో కనీసం 11 మంది ప్రాణాలను కోల్పోయారు. పదుల సంఖ్యలో కార్మికులు మట్టిలో కూరుక్కుపోయారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. స్థానిక గవర్నర్ సెర్గీ సివిలేవ్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో బెలోవో నగరానికి సమీపంలోని కెమెరోవో ప్రాంతంలోని లిస్ట్‌వ్యాజినా గనిలో 285 మంది ఉన్నారు. గనిలో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. ఇక్కడ 2004లో మీథేన్ పేలుడు వల్ల 13 మంది చనిపోయారు.

గురువారం జరిగిన ప్రమాదంలో కనీసం 11 మంది మృతి చెందగా, 46 మంది భూగర్భంలో చిక్కుకుపోయారని సివిలేవ్ స్థానిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. భూమి కింద చిక్కుకున్న వారితో ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదని టెలిగ్రామ్‌లోని వీడియోలో అధికారులు పేర్కొన్నారు. గని లోపల పొగ లేదు, కాబట్టి క్రింద మంటలు లేవని మేము భావిస్తున్నామన్నారు. గనిలో వెంటిలేషన్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందని తెలిపారు. గని లోపల చిక్కుకున్న 43 మందిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక గవర్నర్ సెర్గీ సివిలేవ్ వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరులకు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8:35 గంటలకు గనిలోకి పొగ వ్యాపించిందని స్థానిక పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పొగ కారణంగా చాలా మంది కూలీలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 1956 నుంచి ఇక్కడి లిస్ట్‌వ్యజ్ఞాన గనిలో పని ప్రారంభమైంది.

మాజీ సోవియట్ యూనియన్‌లో పేలవమైన భద్రతా ప్రమాణాలు, పని పరిస్థితుల పర్యవేక్షణ లేకపోవడం,కాలం చెల్లిన సోవియట్-యుగం పరికరాల ఫలితంగా మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి అక్టోబర్ 2019 లో సైబీరియాలోని బంగారు గని వద్ద అక్రమ డ్యామ్ కూలిపోవడంతో 17 మంది మరణించారు. అదే నెలలో, ప్రపంచంలోనే అతిపెద్ద నికెల్ పల్లాడియం ఉత్పత్తి చేసే నోరిల్స్క్ నికెల్ గ్రూప్‌కు చెందిన ఆర్కిటిక్‌లోని గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆగస్టు 2017లో రష్యాలోని అల్రోసా నిర్వహిస్తున్న సైబీరియన్ డైమండ్ మైన్‌లో వరదలు రావడంతో ఎనిమిది మంది తప్పిపోయారు.

Read Also…  Delhi Metro: మెట్రో పింక్ లైన్‌లో పరుగులు పెట్టిన డ్రైవర్‌లెస్ రైలు.. దేశంలో అందుబాటులోకి తొలి DTO నెట్‌వర్క్ సిస్టమ్