AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి, గాయాలతో బయటపడిన ఫ్యామిలీ

సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మరణించగా.. వారి బంధువులు గాయపడినట్టు తెలుస్తోంది. మృతుడు హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన యూసఫ్‌గా గుర్తించిన భారత రాయబార కార్యాలయం.. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు యూసఫ్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి, గాయాలతో బయటపడిన ఫ్యామిలీ
Saudi Arabia Attack
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 12, 2026 | 7:24 AM

Share

సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై ఆదివారం రాత్రి జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో హైదరాబాద్‌ మెహదీపట్నానికి చెందిన మహమ్మద్‌ యూసుఫ్‌ మృతి చెందగా, భార్య, పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబంతో పాటు యూసఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మెహదీపట్నంలోని పిల్లర్‌ నంబర్‌ 19 సమీపంలోని గ్రేస్‌ పారడైజ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే మహమ్మద్‌ యూసుఫ్‌ సౌదీ అరేబియాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుండేవారని బంధువులు చెప్తున్నారు

అయితే వారం రోజుల క్రితం ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి ఉమ్రా యాత్ర కోసం సోది వెళ్లారు యూసఫ్. విమానాశ్రయం నుంచి మదీనాకు వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ పై జరిగిన దాడిలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఇక యూసఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తిరిగి పంపేందుకు భారత రాయబార కార్యాలయంలో కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతోంది.

మరో వైపు ఘటనపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. యూసుఫ్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియతో పాటు గాయపడిన కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయంపై కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం దృష్టి సారించాలని కోరారు. విదేశీ గడ్డపై జరిగిన ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం, వైద్య సహాయం అందేలా చూడటం, మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావడం ప్రస్తుతం అత్యంత కీలకంగా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!