Conjoined Twins: ఏడాది వయసు అవిభక్త కవలలకు అరుదైన చికిత్స.. 14 గంటల పాటు ఆపరేషన్..!

|

May 19, 2023 | 4:43 PM

వారిది నెలలల వయసు.. చూసేందుకు ముద్దు ముద్దుగా ఉన్నారు.. కానీ, వారు అప్పుడే చెప్పలేని అవస్థలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారు అవిభక్త కవలలు. గర్భంలో శరీరభాగాలు కలసిపోయి జన్మించిన ఏకరూప కవలలు. తాజాగా ఓ చిన్నారి అవిభక్త కవలలను వేరు చేసేందుకు అరుదైన శస్త్ర నిర్వహిస్తున్నారు వైద్యులు.

Conjoined Twins: ఏడాది వయసు అవిభక్త కవలలకు అరుదైన చికిత్స.. 14 గంటల పాటు ఆపరేషన్..!
Conjoined Twins
Follow us on

వారిది నెలలల వయసు.. చూసేందుకు ముద్దు ముద్దుగా ఉన్నారు.. కానీ, వారు అప్పుడే చెప్పలేని అవస్థలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారు అవిభక్త కవలలు. గర్భంలో శరీరభాగాలు కలసిపోయి జన్మించిన ఏకరూప కవలలు. తాజాగా ఓ చిన్నారి అవిభక్త కవలలను వేరు చేసేందుకు అరుదైన శస్త్ర నిర్వహిస్తున్నారు వైద్యులు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఈ అరుదైన ఆపరేషన్‌కు వేదికగా నిలిచింది.

రాయల్ కోర్ట్ సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ సూపర్‌వైజర్ జనరల్ (కెఎస్‌రీలీఫ్) డాక్టర్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ అల్ రబీహ్ నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం.. నైజీరియన్‌కు చెందిన జంట కవలలు హస్సానా, హసీనాలను వేరు చేయడానికి శస్త్రచికిత్స ప్రారంభించారు.

చిన్నారులను సపరేట్ చేయడానికి కింగ్ అబ్దుల్లా స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో 35 మంది కన్సల్టెంట్‌లు, స్పెషలిస్ట్‌లు, నర్సింగ్, టెక్నికల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ శస్త్రచికిత్సను ఎనిమిది దశల్లో నిర్వహించాలని భావిస్తున్నామని, దాదాపు 14 గంటల సమయం పడుతుందని డాక్టర్ అల్ రబీహ్ వివరించారు. జనవరి 12, 2022న నైజీరియాలోని కడునాలో ఈ కవలలు జన్మించారు. వారు ఉదరం, పొత్తికడుపు, కాలేయం, ప్రేగులు, మూత్రం, పునరుత్పత్తి వ్యవస్థ, కటి ఎముకలను జాయింట్‌గా జన్మించారు.

ఇవి కూడా చదవండి

కాగా, సియామీ కవలల విభజన కోసం 33 సంవత్సరాలలో 23 దేశాల నుంచి 130 కేసులను పర్యవించింది. 55 కేసులలో ఆపరేషన్ సక్సెస్ అవగా.. ఇది 56వ కేసుగా డాక్టర్ రబీహ్ తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..