China plane crash: చైనా విమాన ప్రమాదంలో సిబ్బందితో సహా 132 మంది మృతి! ఆ 2 బాక్సుల ఆధారంగానే నిజానిజాలు తేల్చలేం..

|

Mar 29, 2022 | 1:53 PM

చైనాకు చెందిన బోయింగ్ MU5735 విమాన ప్రమాద ఘటనలో మొత్తం 3,70,000 చదరపు మీటర్ల మేర విస్తీర్ణంలో ఇప్పటివరకు 36,000 కంటే ఎక్కువ విమాన శిథిలాలను సేకరించినట్లు..

China plane crash: చైనా విమాన ప్రమాదంలో సిబ్బందితో సహా 132 మంది మృతి! ఆ 2 బాక్సుల ఆధారంగానే నిజానిజాలు తేల్చలేం..
China Plane Crash
Follow us on

China Eastern Airlines MU5735 crash 132 passengers and crew spot dead: చైనాకు చెందిన బోయింగ్ MU5735 విమానం గత సోమవారం (మార్చి 21) పర్వతప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో సహా మొత్తం 132 మంది సజీవదహనమయ్యారు. చైనా భూభాగంలో గత 28 ఏళ్లలో ఇంత పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు రెస్క్యూటీమ్‌ భారీ స్థాయిలో రంగంలోకి దిగింది. ప్రమాదానికి గురైన చైనా ఈస్టర్న్ జెట్‌ (China Eastern jet crash)కు సంబంధించిన రెండు బ్లాక్ బాక్స్‌లను రెస్క్యూ సిబ్బంది ఆదివారం కనుగొన్నారని, మరిన్ని విమాన శిధిలాలు, సమీపంలోని వీడియో ఫుటేజ్‌లు, ప్రత్యక్ష సాక్షుల కోసం సిబ్బంది వెతుకుతున్నట్లు చైనా ఏవియేషన్ రెగ్యులేటర్‌కు సంబంధించిన ఓ అధికారి సోమవారం మీడియాకు తెలిపారు. ఐతే కేవలం ఈ రెండు బ్లాక్ బాక్స్‌లు అందించిన డేటా ఆధారంగా మాత్రమే ప్రమాదానికి గల పూర్తి కారణాలను చెప్పలేమని చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లోని ఏవియేషన్ సేఫ్టీ ఆఫీస్ హెడ్ జు టావో మీడియాతో తెలిపారు. బ్లాక్ బాక్స్‌ల నుంచి సేకరించిన డేటాతోపాటు, విమాన శిధిలాలను, ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వీడియో ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలిస్తున్నట్లు జు తెలిపారు.

ఇప్పటివరకు 15,000 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది, సెర్చ్ వర్కర్లు ఘటనా స్థలానికి పంపామని, మొత్తం 3,70,000 చదరపు మీటర్ల మేర విస్తీర్ణంలో ఇప్పటివరకు 36,000 కంటే ఎక్కువ విమాన శిథిలాలను సేకరించినట్లు గాంగ్జీ ఫైర్‌, రెస్క్యూ కాప్‌ హెడ్‌ అయిన జెంగ్‌ జి వెల్లడించారు.

Also Read:

IPL 2022 Cricketers: ఐపీఎల్ 2022 గుజరాత్‌ క్రెకెటర్ల వైఫ్‌లను చూశారా? మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్..