Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ పదో స్థానం పదిలం.. ఆదానీ ఎక్కడున్నారంటే..

|

Mar 16, 2022 | 6:29 PM

Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మరోసారి టాప్‌ 10లో నిలిచి తన సత్తా చాటారు. బ్లూమ్‌బెర్గ్‌ (Bloomberg Billionaires Index) ఏటా విడుదల చేసే ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ..

Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ పదో స్థానం పదిలం.. ఆదానీ ఎక్కడున్నారంటే..
Bloomberg Billionaires Inde
Follow us on

Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మరోసారి టాప్‌ 10లో నిలిచి తన సత్తా చాటారు. బ్లూమ్‌బెర్గ్‌ (Bloomberg Billionaires Index) ఏటా విడుదల చేసే ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఈ జాబితాలో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ 11వ స్థానంలో నిలిచారు. ఈయన ప్రతీ వారం ఆదాయం రూ. 6 వేల కోట్లుగా ఉంది. 46వ స్థానంలో శివ నాడార్‌ ఉండగా, కొత్తగా ఈ జాబితాలో చేరిన భారతీయుల విషయానికొస్తే సీరం ఇన్‌స్టిట్యూట్‌ పూనావాలా 55వ స్థానం, నైకా ఫల్గుణి నాయర్‌ 60వ స్థానం, ఎస్‌పి సింధూజ 67వ స్థానంలో నిలిచారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ 199 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 166 బిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఇక గతేడాది వరకు టాప్‌10 జాబితాలో కొనసాగిన ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆ స్థానాన్ని కోల్పోయారు. 71.1 బిలియన్ల నికర ఆదాయంతో 13వ స్థానానికి పడిపోయారు. ఇదిలా ఉంటే అత్యంత ధనవంతుల టాప్‌ 10 జాబితాలో 8 మంది అమెరికన్లే ఉండడం విశేషం. ముకేశ్‌ అంబానీ (10), ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ (3వ స్థానం) మాత్రమే అమెరికాయేతరులు. ఇక బెజోన్‌ రెండో స్థానంలో, బిల్ గేట్స్ 4, వారెన్ బఫెట్ 5, లారీ పేజ్ 6, సెర్గీ బ్రిన్ 7, స్టీవ్ బాల్మెర్ 8, లారీ ఎలిసన్ 9 స్థానాల్లో ఉన్నారు.

Also Read: Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన భారత ఫాస్ట్ బౌలర్.. ఆ లిస్టులో ఏకైక మహిళా ప్లేయర్‌గా రికార్డు..

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్, శరన్‌ల వివాదానికి ఎండ్ కార్డు.. అకౌంట్స్ సెటిల్ చేసుకున్నామన్న శరన్

Yadadri: యాదాద్రి ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు