Twin Elephants: ఆ దేశంలో 80 ఏళ్ల తర్వాత కవల ఏనుగులు జననం… తల్లితో సంతోషంగా ఆడుకుంటున్న గున్న ఏనుగులు

|

Sep 02, 2021 | 10:51 AM

Twin Elephants: ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడితే ఆ దంపతులకు కలిగే సంతోషం వర్ణించలేనిది.. అదే ఆవు, ఏనుగు వంటి జంతువులకు కవల పిల్లలు పుడితే.. అది జంతు ప్రేమికులకు కాదు...

Twin Elephants: ఆ దేశంలో 80 ఏళ్ల తర్వాత కవల ఏనుగులు జననం... తల్లితో సంతోషంగా ఆడుకుంటున్న గున్న ఏనుగులు
Twin Elephants
Follow us on

Twin Elephants: ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడితే ఆ దంపతులకు కలిగే సంతోషం వర్ణించలేనిది.. అదే ఆవు, ఏనుగు వంటి జంతువులకు కవల పిల్లలు పుడితే.. అది జంతు ప్రేమికులకు కాదు.. కవల పిల్లల్ని ఇష్టపడేవారికి , ప్రకృతి ప్రేమికులకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి అరుదైన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీలంకలో దాదాపు 80 ఏళ్లలో జరగని అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆడ ఏనుగు కవలలకు జన్మనిచ్చింది. పిన్నవాలా ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ లో సురంగి అనే 25 ఏళ్ల ఏనుగ .. కవల ఏనుగులకు జన్మనిచ్చిందని వైల్డ్ లైఫ్ అథారిటీస్ వెల్లడించింది. అదే ఏనుగుల అనాథాశ్రమంలో ఉండే 17సంవత్సరాల మగ ఏనుగు పాండు వీటికి తండ్రి అని తేలింది.

ఏనుగు, పుట్టిన పిల్లలు క్షేమంగా ఉన్నాయని.. గున్న ఏనుగు పిల్లలు చాలా చిన్నవి, అయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయి” అని పిన్నవాలా ఏనుగు అనాథాశ్రమం అధిపతి రేణుక బండారునాయక్  చెప్పారు.  తల్లి ఏనుగు కాళ్లు చుట్టూ తిరుగుతూ ఆకులు తింటూ ఉన్నాయి ఆ పిల్ల ఏనుగులు. శ్రీలంక లో పెంపుడు ఏనుగులు కవలలు ఏనుగులకు చివరిగా 1941 లో జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీలంకలో అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిన పిన్నావాలాను 1975లో ఏర్పాటు చేశారు. గాయాలతో ఉన్న ఏనుగులు, అనాథలైన ఏనుగులకు ఆశ్రయం కల్పిస్తుంటారు.  ఈ అనాథాశ్రమంలో ఇప్పుడు 90 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గున్న కవలలుకూడా లిస్ట్ లో  చేర్చారు. సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్  నివేదిక ప్రకారం.. ఏనుగులకు కవలలు జన్మించే అవకాశం కేవలం 1% మాత్రమే. ఎక్కువగా ఆఫ్రికన్ అడవి ఏనుగులు ఇలా కవలకు జన్మినిస్తాయి.

Also Read: Vizag Footpaths: ఇక నుంచి వైజాగ్ ఫుట్‌పాత్‌ల్లో చేపల అమ్మకంపై నిషేధం.. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు