Rains in Nepal: నేపాల్ లో వర్షాలు, వరదలు బీభత్సం సృస్తిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 21మంది మరణించారు. మరో 24మంది ఆచూకీ ఇంకా లభ్యంకాలేదని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అంతేకాదు భారీ వర్షాలు దేశంలోని 19 జిల్లాలపై తీవ్రంగా ప్రభావితం చుపించాయని ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అనేక ప్రాంతాల్లోని పంటలపై భారీ వర్షాలు ప్రభావం చూపించాయి. కోతకు సిద్ధంగా ఉన్న వేలాది హెక్టార్ల వరి నీటిలో మునిగిపోయింది.
ఎత్తైన కొండ ప్రాంతాలు , పర్వత ప్రాంతాల్లో హిమపాతం పడే అవకాశం ఉన్నాడని.. దీంతో నేపాల్ లో మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ సూచన విభాగం (MFD) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతారణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని.. మధ్య భారత దేశం, నేపాల్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది.
Also Read: తండ్రి బాటలో తనయ.. నేటి నుంచి పాదయాత్రను షురూ చేయనున్న షర్మిల.. 4వేల కి. మీ పాదయాత్ర