ఇంగ్లండ్ లోని కార్న్ వాల్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ లో సరదా ఘటన ఒకటి జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాణి ఎలిజిబెత్ తన చర్యతో అందర్నీ ఆశ్చర్యపరిచారు..ఆహ్లాద పరిచారు. తన 70 సంవత్సరాల రాచరిక మహా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్లాటినం జూబిలీని సెలబ్రేట్ చేసుకున్నఈమె పుట్టినరోజు వేడుకలను సంబరంగా జరిపించాలనుకున్నారు సమ్మిట్ నిర్వాహకులు.. దీంతో భారీ కేక్ ను తెప్పించారు. దీన్ని సాధారణ చాకుతో కట్ చేసే బదులు మూడు అడుగుల పొడవైన ఖడ్గాన్ని కూడా వాళ్ళు తెప్పించారు. తెప్పించారు గానీ దీంతో ఆమె కేక్ కట్ చేయగలరా అని సందేహించారు. అయితే రాణిగారు మాత్రం ఏ జంకు లేకుండా సుతారంగా ఆ ఖడ్గం తోనే కట్ చేశారు. పక్కనే చాకు ఉందని చెప్పినా ఆమె సుతారంగా తిరస్కరించారు. కెమిల్లా, కేట్ మిడిల్ టన్ వంటి సెలబ్రిటీలతో సహా అంతా చప్పట్లతో రాణి ఎలిజెబెత్ ని అభినందించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. నిజానికి ఏప్రిల్ 21 తో రాణి ఎలిజిబెత్ కి 96 ఏళ్ళు వచ్చాయి. అయితే సాధారణంగా అధికారిక సెలబ్రేషన్స్ జూన్ లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. కోవిద్ పాండమిక్ కారణంగా ఈ సారి కూడా ఈ వేడుకలను ఇప్పటివరకు నిర్వహించలేదు.
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఏడు దేశాల అధినేతల్లో ఒక్క భారత ప్రధాని మోదీ మాత్రం వర్చ్యువల్ గా వీటిలో పాల్గొనగా….. మిగతావారంతా తమతమ దేశాలనుంచి వచ్చి హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిద్ అదుపునకు తీసుకోవలసిన చర్యలపై వీరు ప్రధానంగా చర్చించారు. 2022 నాటికి ఈ ప్రపంచంలో పూర్తిగా కోవిద్ నిర్మూలన జరగాలని వీరు పిలుపునిచ్చారు.
Her Majesty wielding a sharp sword, and an even sharper tongue ? pic.twitter.com/PulzMpj86Y
— Thomas Newton (@SkyTNewton) June 11, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: తిమింగిలం మింగేసింది…….అయినా బతికి బయట పడ్డాడు….అమెరికాలో అరుదైన ఘటన !
TVS Sport: కేవలం రూ.1555 ఉంటే చాలు.. టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ సొంతం.. లీటరుకు 110 కి.మీ మైలేజ్