China vs Quad Meeting: క్వాడ్‌ సదస్సుపై రగిలిపోతోన్న చైనా.. రష్యాతో కలిసి ఏం చేసిందంటే..

China vs Quad Meeting: ఓవైపు క్వాడ్‌ సదస్సు జరుగుతున్న వేళ జపాన్‌ గగనతలంలో చైనాతో పాటు రష్యా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టాయి.

China vs Quad Meeting: క్వాడ్‌ సదస్సుపై రగిలిపోతోన్న చైనా.. రష్యాతో కలిసి ఏం చేసిందంటే..
Jets Fly

Updated on: May 25, 2022 | 9:32 PM

China vs Quad Meeting: ఓవైపు క్వాడ్‌ సదస్సు జరుగుతున్న వేళ జపాన్‌ గగనతలంలో చైనాతో పాటు రష్యా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టాయి. కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉన్నట్టు సంకేతాన్ని పంపించాయి. అవును, క్వాడ్‌ సదస్సుపై రగిలిపోతోంది చైనా. ఓవైపు జపాన్‌లో క్వాడ్‌ సదస్సు జరుగుతున్న వేళ డ్రాగన్‌ రష్యాతో కలిసి రెచ్చగొట్టే పనులు చేసింది. నలుగురు దేశాధినేతల సమావేశమైన జపాన్‌ గగనతలంలో చైనా, రష్యా యుద్దవిమానాలు చక్కర్లు కొట్టాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ జపాన్‌లో ఉండగానే చైనా, రష్యా బాంబర్లు యుద్ద విన్యాసాలు చేశాయి. ఆసియాలో మరో నాటో కూటమిని తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటోంది చైనా.

ఇక క్వాడ్‌ సదస్సులో ఉక్రెయిన్‌పై చేసిన వ్యాఖ్యలు రష్యాకు నచ్చలేదు. అందుకే చైనాకు తోడుగా రష్యా యుద్ద విమానాలు కూడా విన్యాసాల్లో పాల్గొన్నాయి. అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డాయి. రెండు రోజుల పాటు టోక్యోలో క్వాడ్‌ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్‌ తీరంలో ఎలాంటి సరిహద్దు మార్పులను అంగీకరించలేదని క్వాడ్‌ కూటమి హెచ్చరించింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే తాము రంగంలోకి దిగుతామని క్వాడ్‌ కూటమి వేదికగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.

తమ తీరం సమీపంలో చైనా-రష్యా వైమానిక విన్యాసాలపై జపాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత నవంబర్‌ నుంచి జపాన్‌ సమీపంలో రష్యా-చైనా విమానాలు చక్కర్లు కొట్టడం ఇది నాలుగోసారి. క్వాడ్‌ దేశాలను రెచ్చగొట్టేందుకే చైనా-రష్యా ఈ విన్యాసాలు చేశాయని జపాన్‌ మండిపడింది.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌, తైవాన్‌ను ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని క్వాడ్‌ కూటమి చైనా, రష్యాలను సంయుక్తంగా హెచ్చరించాయి. రెచ్చగొట్టే విధానాన్ని మానుకోవాలని చైనాను పలుమార్లు దౌత్యపరంగా కోరినట్టు వెల్లడించింది చైనా విదేశాంగశాఖ. ఓవైపు ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాను ప్రపంచ దేశాలు నిందిస్తుంటే చైనా అండగా నిలవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.

జపాన్‌ తన సరిహద్దులను కాపాడుకోవడానికి గట్టి నిఘా పెట్టాల్సి వస్తోంది. ఏడాది కాలంలో జపాన్‌ 1004 సార్లు యుద్ద విమానాలు సరిహద్దులకు పంపించాల్సి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us