Diana Wedding Cake: 40 ఏళ్ల నాటి రాయల్ కేక్‌ లక్షలు పలికింది.. వేలంలో దక్కించుకునేందుకు భారీ క్యూ..

|

Aug 13, 2021 | 9:34 AM

ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా వివాహ కేక్ ముక్కను 1,850 పౌండ్లకు (రూ .1,90,324) వేలం వేశారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితంనాటి కేకు ముక్కను వేలం పాటకు పెడితే కొనేందుకు జనం క్యూ కట్టారు.

Diana Wedding Cake: 40 ఏళ్ల నాటి రాయల్ కేక్‌ లక్షలు పలికింది.. వేలంలో దక్కించుకునేందుకు భారీ క్యూ..
Charles And Diana S Wedding
Follow us on

Charles and Diana’s Wedding Cake: ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా వివాహ కేక్ ముక్కను 1,850 పౌండ్లకు (రూ .1,90,324) వేలం వేశారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితంనాటి కేకు ముక్కను వేలం పాటకు పెడితే కొనేందుకు జనం క్యూ కట్టారు. చివరికి అది రూ.1.9 లక్షల ధరకు అమ్ముడైంది. అది భారీ ధర అని చెప్పాలి. ఈ కేక్ ముక్క బ్రిటిష్ రాజ దంపతులు వారి వివాహంలో అందించిన 23 అధికారిక వివాహ కేక్‌లలో ఒకటి. అప్పట్లో అంటే 1981 జూలై 29న ఉంగరాలు మార్చుకుంటూ పెళ్లి ప్రమాణాలు చేసిన వేళ చార్లెస్‌-డయానాలు 23 కేకులు కట్‌ చేశారు. అందులోని ఓ కేకు ముక్క ఇది. అప్పట్లో ఈ కేకు ముక్కను రాజ మందిరంలో పనిచేసిన మోయా స్మిత్‌కు ఇచ్చారు. ఈ కేక్‌ను ఆమె కుటుంబ సభ్యులు 2008లో ఓ కలెక్టర్‌కు విక్రయించారు. బుధవారం ఇది వేలానికొచ్చింది. గ్యారీ లేటన్‌ అనే వ్యక్తి 2,565 డాలర్లుకు కొనుక్కున్నారు.

ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల వివాహ కేక్‌’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్‌ వేసి ఉంది. స్మిత్‌ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు. ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు. ‘‘వాస్తవంగా ఈ కేక్‌ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు.

ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. కేక్ ముక్కను బుధవారం గెర్రీ లైటన్‌కు విక్రయించారు. ఈ ముక్క కేవలం £ 500 మాత్రమే లభిస్తుందని అంచనా వేయబడింది. కానీ వేలంపాటదారులు అది అమ్ముడుపోయిన ధరను చూసి “ఆశ్చర్యపోయారు”.

పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణలుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..