Modi US Visit: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చారిత్రాత్మకం.. హారిస్‌తో భేటీలో మోడీ వ్యాఖ్యలు.

|

Sep 24, 2021 | 3:24 AM

Modi US Visit: అమెరికాలో పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదట అమెరికాలోని టాప్‌ గ్లోబల్‌ కంపెనీల సీఈఓలతో సమావేశమైన నరేంద్ర మోడీ ఆ తర్వాత అమెరికా..

Modi US Visit: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చారిత్రాత్మకం.. హారిస్‌తో భేటీలో మోడీ వ్యాఖ్యలు.
Follow us on

Modi US Visit: అమెరికాలో పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదట అమెరికాలోని టాప్‌ గ్లోబల్‌ కంపెనీల సీఈఓలతో సమావేశమైన నరేంద్ర మోడీ ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చారిత్రాత్మకమని మోదీ అన్నారు. బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలో అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగవుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ కమలా హారిస్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు. ఇక కమలా హారిస్‌ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్‌ ప్రత్యేక భాగస్వామి అని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో ఎన్నో దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ అందించిందన్నారు. ఇక భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి చెందినప్పుడు అమెరికా తన బాధ్యతగా సహకారం ఇచ్చిందని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ సాయం చేసిందన్నారు.

భారత్‌లో ప్రస్తుతం రోజుకు కోటీ టీకాలు వేస్తున్నారని తెలుస్తోందని కమలా అన్నారు. త్వరలోనే భారత్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను తిరిగి ప్రారంభిస్తుందని మోడీ తెలిపినట్లు కమలా హారిస్‌ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని.. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కమలా హారిస్ చెప్పుకొచ్చారు.

Also Read: Modi US Visit: కొనసాగుతోన్న ప్రధాని అమెరికా పర్యటన.. పలు గ్లోబల్‌ కంపెనీల సీఈఓలతో సమావేశమైన నరేంద్ర మోడీ.

రూ. 21వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. గుజరాత్‌లోని పోర్టు సెంట్రిక్‌గా సంచలన విషయాలు

AIR Pollution: ఊపిరి తీస్తోన్న గాలి.. వాయు కాలుష్యంతో ఏటా ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా? హెచ్చరిస్తోన్న WHO..