AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ మాకు ఆప్తమిత్రుడు.. త్వరలోనే భారత్‌తో ట్రేడ్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన..

మోదీ మాకు ఆప్తమిత్రుడు.. భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్‌లో దాదాపు 16 నెలల తర్వాత ప్రధాని మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య మెగా ట్రేడ్ డీల్ కుదురబోతుందని ట్రంప్ ప్రకటించారు.

మోదీ మాకు ఆప్తమిత్రుడు.. త్వరలోనే భారత్‌తో ట్రేడ్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన..
Pm Modi, Us President Trump Meet At France
Krishna S
|

Updated on: Jun 17, 2026 | 8:21 PM

Share

భారత్ – అమెరికా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ – ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత 16 నెలల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. భారత్ – అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలను రీసెట్ చేయడంపైనే ఇరు నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “మిస్టర్ ప్రెసిడెంట్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గత ఏడాది వాషింగ్టన్‌లో మనం కలుసుకున్నప్పటి నుండి మన దేశాల బంధంలో సరికొత్త వేగం, సరికొత్త శక్తి వచ్చాయి. మన రెండు బృందాలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మేము వేగంగా ప్రయత్నాలు చేస్తున్నాము” అని ఆనందం వ్యక్తం చేశారు.

త్వరలోనే ట్రేడ్ డీల్..

ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వాణిజ్య వివాదాలకు త్వరలోనే తెరపడనుందని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది. భారత్-అమెరికా మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ఇరుపక్షాలు వెల్లడించాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందిస్తూ.. ‘‘భారతదేశంలో మేము భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. ప్రధాని మోదీ మాకు అత్యంత ఆప్తమిత్రుడు. అమెరికా ఎల్లప్పుడూ భారత్‌కు అండగా ఉంటుంది” అని చెప్పారు.

హర్మూజ్ జలసంధిపై మోదీ కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ అభినందించారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికుల్లో దాదాపు 10 శాతం మంది భారతీయులే ఉన్నారని గుర్తు చేస్తూ, వారి భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడం ప్రపంచ వాణిజ్యానికి ఎంతో మేలు చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. హర్మూజ్ ప్రాంతం వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని, అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛగా సాగాలని ఆయన నొక్కి చెప్పారు.

Follow Us
మోదీ మాకు ఆప్తమిత్రుడు.. త్వరలోనే భారత్‌తో ట్రేడ్ డీల్..
మోదీ మాకు ఆప్తమిత్రుడు.. త్వరలోనే భారత్‌తో ట్రేడ్ డీల్..
ఆ విద్యార్థులకు ఫ్రీ బస్.. మంత్రి ప్రకటన
ఆ విద్యార్థులకు ఫ్రీ బస్.. మంత్రి ప్రకటన
12 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి, షెఫాలీ జోడీ.. అదేంటంటే?
12 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి, షెఫాలీ జోడీ.. అదేంటంటే?
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..