PM Modi: ఈ పర్యటన భారత్-ఖతార్ స్నేహానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది.. కీలక వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ..

PM Modi Qatar visit: భారతదేశం- ఖతార్ మధ్య చారిత్రాత్మక సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్-మురైఖీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. దీని తర్వాత భారతీయ సమాజం కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికింది. బుధవారం అర్ధరాత్రి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు.

PM Modi: ఈ పర్యటన భారత్-ఖతార్ స్నేహానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది.. కీలక వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ..
PM Modi Qatar visit

Updated on: Feb 15, 2024 | 6:19 PM

PM Modi Qatar visit: భారతదేశం- ఖతార్ మధ్య చారిత్రాత్మక సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్-మురైఖీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. దీని తర్వాత భారతీయ సమాజం కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికింది. బుధవారం అర్ధరాత్రి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఖతార్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఖతార్ అమిర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ మోదీకి స్వాగతం పలికారు. భారత్, ఖతార్ మధ్య సంబంధాల పెంపుదలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాని మోదీ అద్భుతంగా అభివర్ణించారు. అనంతరం ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్-ఖతార్ సంబంధాలతోపాటు ప్రపంచ సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ లో కీలక విషయాన్ని షేర్ చేశారు.

‘‘నా ఖతార్ పర్యటన భారత్-ఖతార్ స్నేహానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, సంస్కృతికి సంబంధించిన కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి భారతదేశం ఎదురుచూస్తోంది. ఆతిథ్యం ఇచ్చినందుకు ఖతార్ ప్రభుత్వానికి, ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అంటూ ట్వీట్ చేసి ఓ వీడియోను పంచుకున్నారు.


సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకుంటూ, ప్రధాని నరేంద్ర మోడీ.. భారతదేశం – ఖతార్ మధ్య సంబంధాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయని రాశారు. ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌తో తాను భేటీ అయినట్లు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై సమీక్షించామన్నారు. అనేక రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాల గురించి కూడా చర్చించామని.. పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయంటూ తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ పర్యటనపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కార్యక్రమంలో మూడు ప్రధానమైన, ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నారు. అమిరి దివాన్‌లో ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు, అక్కడ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య భాగస్వామ్యంతో సహా ద్వైపాక్షిక సహకారం విస్తృత రంగాలపై వివరణాత్మక చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు చర్చించారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..