ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటన నిన్నటితో ముగిసింది. జూలై 11న సాయంత్రం భారతదేశానికి తిరుగుపయనం అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఈ పర్యటన దేశాభివృద్దికి దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా 41ఏళ్ల తరువాత ఆస్ట్రియా పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంలో, సాంకేతిక, పలు పరిశ్రమల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. తన పర్యటనను గుర్తుకు చేసుకుంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో ఆస్ట్రియా దేశ అధ్యక్షులు తనకు పలికి ఆహ్వానం మొదలు ఆతిథ్యం వరకూ అన్నింటినీ జోడించారు. అలాగే పలు వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పురోగతిపై చర్చించిన దృశ్యాలను పొందుపరిచారు.
ఈ పర్యటనలో పలు దేశాల అధ్యక్షులను కలిశారు. ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపడానికి తన వంతు కృషి చేస్తానని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మోదీకి ఘనస్వాగతం లభించింది. భారత ప్రధాని వియన్నాలో పర్యటించడం 41 ఏళ్లలో తొలిసారి. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. ఆమె తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీనే. ఆస్ట్రియాలో సంగీతకారులు వందేమాతరం గీతంతో మోదీకి వెల్‌కమ్ చెప్పారు. ఆస్ట్రియా చాన్స్‌లర్ కార్ల్ నెహామర్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మోదీకి ఆస్ట్రియా ఛాన్సలర్ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ప్రస్తుతం ఇరుదేశాలు దౌత్య సంబంధాలు ఏర్పాటుచేసుకొని 75ఏళ్లు పూర్తయినట్లు భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డర్ బెలెన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
జూలై 10న నోబెల్ అవార్డు గ్రహీత ఆంటోన్ జైలింగర్ ను కలిశారు. కాసేపు ఆయనతో మాటామంతి నిర్వహించారు. దేశ పరిస్థితులు, భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతను గురించి సుదీర్ఘంగా చర్చించారు. క్వాంటం మెకానిక్స్‌లో అతని పనితీరు తనను ఎంతో ప్రేరేపించిందన్నారు మోదీ. ఈ విషయాన్ని తన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఎన్నో ఆవిష్కరణలకు, ఆవిష్కరణ కర్తలకు ఆయన మార్గనిర్థేశం అని కొనియాడారు. నేషనల్ క్వాంటం మెకానిజం పట్ల ఆయనకు ఉన్న జ్ఙానం, అభిరుచి స్పష్టంగా కనిపించిందన్నారు. భారతదేశానికి అవసరమైన సాంకేతికత, ఆవిష్కరణలు గురించి ఆయనతో చర్చించానన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఎలా అభివృద్ది చెందాలన్న అంశాలపై ఆంటోన్ జైలింగర్ తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వివరించారు. వీటన్నింటినీ స్మరించుకుంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.
May the India-Austria friendship scale new heights of progress!
Highlights from a special visit.@karlnehammer pic.twitter.com/wW7KGIHxqp
— Narendra Modi (@narendramodi) July 11, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..