Afro-Brazilian: బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి వినూత్న స్వాగతం… స్వదేశీ సంగీతంతో కలిపిన శివ తాండవ స్తోత్రం ప్రదర్శన

ప్రధాని మోదీకి బ్రెజిలియాలో ఘనస్వాగతం లభించింది. నాలుగు రోజులపాటు బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని. 17వ బ్రిక్స్‌ సదస్సును ముగించుకుని ఆయన బ్రెజిలియాకు చేరుకున్నారు. అంతకు ముందు బ్రెజిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, స్పేస్‌, టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో...

Afro-Brazilian: బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి వినూత్న స్వాగతం... స్వదేశీ సంగీతంతో కలిపిన శివ తాండవ స్తోత్రం ప్రదర్శన
Brazil Grand Welcome Pm Mod

Updated on: Jul 08, 2025 | 8:25 AM

ప్రధాని మోదీకి బ్రెజిలియాలో ఘనస్వాగతం లభించింది. నాలుగు రోజులపాటు బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని. 17వ బ్రిక్స్‌ సదస్సును ముగించుకుని ఆయన బ్రెజిలియాకు చేరుకున్నారు. అంతకు ముందు బ్రెజిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, స్పేస్‌, టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో రెండుదేశాల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు సంప్రదాయ స్వాగతం పలికారు.

ఆపరేషన్‌ సింధూర్‌ థీమ్‌తో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. పాక్‌ ఉగ్రవాదంపై భారత దాడిని కీర్తిస్తూ కళాకారులు నృత్యం చేశారు. భారత్‌ మాతా కీ జై నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. ఇక ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు బ్రెజిల్ స్థానిక తెగల ప్రజలు. అడవుల్లో వినిపించే స్వదేశీ సంగీతంతో కలిపిన శివ తాండవ స్తోత్రం ప్రదర్శించారు.

బ్రెజిల్‌లోని రియో డీ జనీరో వేదికగా జరిగిన బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత్‌ సహా బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుంచి గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు కనీస సహకారం ఉండటం లేదన్నారు ప్రధాని. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు లేకుండా ఈ సంస్థలన్నీ సిమ్‌కార్డుండి.. నెట్‌వర్క్‌లేని మొబైల్‌ఫోన్ల లాంటివని వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దం నాటి టైప్‌రైటర్లతో 21వ శతాబ్దం నాటి సాఫ్ట్‌వేర్‌ నడవదన్నారు