Trump Tariffs: ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు అమలు వాయిదా… జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు విధింపు
ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు అమలు షురువైంది. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు విధించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భారత్‌పై 26 శాతం ఎగుమతి సుంకాలు విధించారు. 180 దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్...

ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు అమలు ఆగస్టు 1కి వాయిదా పడింది. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు విధించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భారత్‌పై 26 శాతం ఎగుమతి సుంకాలు విధించారు. 180 దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది.
ఏప్రిల్‌లో 10 శాతం బేస్ టారిఫ్ రేటుతో చాలా దేశాలకు అదనపు టారిఫ్‌లను ప్రకటించారు. కొన్ని దేశాలపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. అయితే చర్చలకు సమయం ఇవ్వడానికి 10 శాతం బేస్ కంటే ఎక్కువగా ఉన్న అన్ని సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. జూలై9తో ఈ గడువు ముగుస్తుండటం, బ్రిక్స్ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపట్టటంతో.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ పంతంమీదున్నారు.
ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలల దేశాల నేతలను ఉద్దేశిస్తూ రాసిన లేఖలను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు ప్రతీకార సుంకాలను పెంచవద్దని కోరారు. ఒకవేళ పంథానికి పోయి సుంకాలు పెంచితే వారి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని ట్రంప్ హెచ్చరించారు. ‘మీరు ఏ కారణాలవల్ల సుంకాలను పెంచినా ఇప్పుడు మేం విధించిన 25శాతానికి అదనంగా ఆ సుంకాలను వేస్తాం’ అని అగ్రరాజ్యం అధినేత హెచ్చరించారు. మిగిలిన దేశాలకూ ప్రతీకార సుంకాల గడువును ఆగస్టు 1 వరకూ పొడిగించారు.
వాణిజ్య ఒప్పందంకోసం కొన్నాళ్లుగా అమెరికాతో చర్చిస్తున్నారు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్. ట్రేడ్ డీల్ కుదిరితే డెయిరీ, వ్యవసాయరంగాలకు మినహాయింపులు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. అయితే బట్టలు, చెప్పులు, లెదర్, స్టీల్, మెడిసన్, అల్యూమినియం, శ్రమ ఆధారిత ఎగుమతులపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్ కోరుతోంది. మరోవైపు తమతో ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలకు సోమవారం నుంచి లేఖలను పంపడం ప్రారంభించింది ట్రంప్ సర్కార్. ఆగస్టు 1 నుంచి భారీ సుంకాల మోత మోగించనున్నట్లు హెచ్చరిస్తోంది. దీంతో భారత్‌కు మరికొంత కాలం గడువు లభించింది. బుధవారంలోగా భారత్, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది.




