PM Modi Tour: మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన… నేడు మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవానికి మోదీ

ప్రధాని మోదీ రెండో రోజు మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవానికి మోదీ హాజరుకానున్నారు. మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడం ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. మాల్దీవుల్లో మోదీ పర్యటనను ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తోంది...

PM Modi Tour: మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన... నేడు మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవానికి మోదీ
Modi Maldives Tour

Updated on: Jul 26, 2025 | 6:53 AM

ప్రధాని మోదీ రెండో రోజు మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవానికి మోదీ హాజరుకానున్నారు. మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడం ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. మాల్దీవుల్లో మోదీ పర్యటనను ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తోంది ప్రపంచం. మామూలుగా చైనాను నమ్ముకుని మాల్దీవ్స్‌ చేసిన ఓవరాక్షన్‌కు ఇండియా సైలెంట్‌గా జవాబిచ్చింది. భారత్ బాయ్‌కాట్ మాల్దీవ్స్ దెబ్బకు మాల్దీవ్స్ బిజినెస్ మొత్తం కుదేలైంది. తర్వాత తత్వం బోధపడి భారత్‌ కరుణకోసం అర్రులు చాచింది. దానికి బెస్ట్‌ ఎగ్జాంపులే మాల్దీవుల రక్షణ బిల్డింగ్‌పై వందల అడుగుల మోదీ కటౌట్‌.

శుక్రవారం మాల్దీవ్స్‌లో మోదీ అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికింది మాల్దీవుల అధికార గణం. ఎయిర్‌పోర్ట్‌లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, మంత్రులు మోదీని ఘనంగా స్వాగతించారు. మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర్య దినోత్సవం కాస్తా భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాలకు 60 ఏళ్ల వేడుకగా మారింది. 2024లో ముయిజ్జు “ఇండియా ఔట్” నినాదంతో గెలిచిన తర్వాత ఇరుదేశాల మధ్య గ్యాప్ పెరిగింది.

మోదీ లక్షద్వీప్ ట్రిప్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన వివాదాస్పద కామెంట్స్‌తో #BoycottMaldives ట్రెండ్ భారత్‌లో వైరల్ అయింది. దీంతో భారతీయ టూరిస్టుల సంఖ్య 14% నుండి 6%కి పడిపోయి, మాల్దీవ్స్ ఆర్థికంగా దెబ్బతింది.2024లో ముయిజ్జు “ఇండియా ఔట్” క్యాంపెయిన్, చైనాతో సన్నిహిత సంబంధాల కారణంగా దాదాపు మా్ల్దీవులను శత్రుదేశంగానే భారత సమాజం చూసింది. ముయిజ్జు 78మంది భారత సైనికులను వెనక్కి పంపాలని కోరడం, మోదీ ముస్లీం వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పాటు ముయిజ్జు తన తొలి విదేశీ పర్యటనల్లో టర్కీ, చైనాలను ఎంచుకుని భారత్‌ను సైడ్ చేయడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది.

అప్పట్నుంచి మాల్దీవుల పతనం కొంచెంకొంచెంగా ప్రారంభమైంది. భారత్‌ ను కాదని చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. అది కాస్తా 1.4 బిలియన్ డాలర్ల చైనా రుణఉచ్చులో చిక్కుకునేలా చేసింది. ఈ రుణాలు మాల్దీవ్స్ జీడీపీలో 20% . ఇంత గడ్డుపరిస్థితుల్లో ఉన్న మాల్దీవ్స్‌ను ఆదుకుంది భారతే. పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న మాల్దీవ్స్‌కు 124 మిలియన్ డాలర్ల రుణం, 1.4 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, 100 మిలియన్ డాలర్ల సాయంతో వెన్నుదన్నుగా నిలిచింది. ఈపర్యటనలోనే రోడ్ డెవలప్‌మెంట్, హనిమాదూ ఎయిర్‌పోర్ట్ అప్‌గ్రేడ్, 4వేల హౌసింగ్ యూనిట్ల ప్రాజెక్ట్‌లను మోదీ ప్రారంభించారు.

భారత్ 565 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌తో మాల్దీవ్స్ రుణ ఒత్తిడిని తగ్గించింది. ఉతురు తిలాఫల్హు నావల్ బేస్‌కి 50 మిలియన్ డాలర్ల క్రెడిట్ కూడా ఇచ్చింది. భారత్ సాయంతో మాల్దీవ్స్‌ను ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేశాయి. భారత్‌తో సహకారం మాల్దీవ్స్‌కు ఆర్థిక, రాజకీయ స్టెబిలిటీ ఇస్తుందని మోదీ పర్యటన నిరూపించింది. మోదీ పర్యటనతో మాల్దీవులకు భారతీయ టూరిస్టులు పెరిగే చాన్సు ఉంది. భారత్ మహాసాగర్ విజన్‌తో మాల్దీవ్స్‌తో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. దీంతో చైనాకు కౌంటర్ వేయడం, ఇండియన్ ఓషన్‌లోఆధిపత్యాన్ని కాపాడుకోవడం భారత్ గోల్.

1988లో ఆపరేషన్ కాక్టస్, 2004 సునామీ, 2014 వాటర్ క్రైసిస్, 2020 కోవిడ్ సమయంలో భారత్ మాల్దీవ్స్‌కు సాయం చేసింది. మోదీ పర్యటనలో UPI సర్వీసెస్ లాంచ్, ట్రేడ్ డీల్స్ రెండు దేశాల మధ్య జరగనున్నాయి. అలాగే మాల్దీవ్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, ఫిషరీస్, రిన్యూవబుల్ ఎనర్జీలో భారత్ ఇన్వెస్ట్ చేస్తోంది. సముద్ర భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్‌పై సహకారం పెరగాలని రెండు దేశాలు నిర్ణయించాయి.ఈ వ్యూహంతో భారత్ మాల్దీవ్స్‌ను చైనా రుణ ఉచ్చు నుండి బయటపడేసి, రీజియనల్ స్టెబిలిటీని స్ట్రాంగ్ చేస్తుందంటున్నారు విశ్లేషకులు.