G20 SUMMIT: G20 సదస్సులో అందరినీ ఆకట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశీనేతలకు అదిరిపోయే బహుమతులు..

ఇండోనేషియాలో జరిగిన జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని.. బిజి బిజిగా గడిపారు. రెండు రోజుల సదస్సులో భాగంగా అనేకమంది దేశాధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమై అనేక అంశాలపై..

G20 SUMMIT: G20 సదస్సులో అందరినీ ఆకట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశీనేతలకు అదిరిపోయే బహుమతులు..
Modi Present Gifts To World Leaders
Follow us

|

Updated on: Nov 16, 2022 | 9:30 PM

ఇండోనేషియాలో జరిగిన జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని.. బిజి బిజిగా గడిపారు. రెండు రోజుల సదస్సులో భాగంగా అనేకమంది దేశాధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. ఇదే సందర్భంగా ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలకు అదిరిపోయే బహుమతులు అందజేశారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులకు భారతీయ కళలు, సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని బహుమతులను అందించారు.

Gift To Usa

Gift To Usa

అమెరికా అధ్యక్షుడికి కాంగ్రా మినియేచర్ పెయింటింగ్స్

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ పెయింటింగ్ ఇచ్చారు. కాంగ్రా మినియేచర్ పెయింటింగ్‌లు సాధారణంగా ‘శృంగర్ రస’ లేదా సహజ నేపథ్యంలో ప్రేమను చిత్రీకరిస్తాయి. దైవభక్తి, ప్రేమ భావన ప్రధాన ఇతివృత్తంతో ఈ పెయింటింగ్స్ ను రూపొందిస్తారు. 18వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో ఈ చిత్రకళ అభివద్ది చెందింది. మొఘల్ చిత్రకళలో శిక్షణ పొందిన కాశ్మీరీ చిత్రకారుల కుటుంబం గులేర్ రాజా దలీప్ సింగ్ ఆస్థానంలో ఆశ్రయం పొందినప్పుడు ఈ కళ ఉద్భవించింది. మహారాజా సన్సార్ చంద్ కటోచ్ కాలంలో కాంగ్రా కళ అత్యున్నత స్థాయికి చేరుకుంది.ఈ సున్నితమైన పెయింటింగ్‌లను నేడు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మాస్టర్ పెయింటర్లు సహజ రంగులను ఉపయోగించి తయారు చేశారు.

Gift To United Kingdom

Gift To United Kingdom

బ్రిటన్ ప్రధాని కోసం మాతా నీ పచేడి

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు మాటా నీ పచ్చడి బహుమతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు. మాతా నీ పచేడి అనేది గుజరాత్‌కు చెందిన హస్తకళ రూపం. దీనిని మాతృ దేవత,పుణ్యక్షేత్రాల నేపధ్యంతో రూపొందించారు. మాతా నీ పచ్చడి అనేది గుజరాతీ భాష పదం ‘మాత’ అంటే ‘మాతృ దేవత’, ‘ని’ అంటే ‘చెందినది’ ‘పచేడి’ అంటే ‘నేపథ్యం’ అని అర్థం. జానపద కథల ఆధారంగా ఈ కళారూపాన్ని రూపొందిస్తారు. వాగ్రిస్ అనే సచార తెగవారు ఈ హస్తకళలో నిష్ణాతులు. ఈ హస్తకళ రూపంలో దేవి లేదా శక్తి రూపాల ఇతిహాసాలను కూడా ఇందులో వర్ణిస్తారు.

ఇవి కూడా చదవండి
Gift To Australia

Gift To Australia

ఆస్ట్రేలియా ప్రధానికి పిథోరా

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిథోరాను బహుమతిగా అందజేశారు. పిథోరా అనేది గుజరాత్‌లోని ఛోటా ఉదయపూర్‌ చెందిన జానపదకళ. రథ్వా అనే కళాకారుల వీటిని రూపొందిస్తారు. గుజరాత్‌లోని అపారమైన సంపన్నమైన జానపద, గిరిజన కళల సంస్కృతిని ఉదహరిస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న తత్వానికి ఇది సజీవ నిదర్శనం.ఈ పెయింటింగ్స్ లో గిరిజనుల సామాజిక, సాంస్కృతిక, పౌరాణిక జీవితం, నమ్మకాలను ప్రతిబింబించేలా రూపొందిస్తారు. ఇవి కుడ్యచిత్రంగా ఒక పిథోరాకు సాంస్కృతిక మానవ శాస్త్రం యొక్క వార్షికోత్సవాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పెయింటింగ్‌లు ఆస్ట్రేలియాలోని స్వదేశీ కమ్యూనిటీల నుండి వచ్చిన ఆదిమ డాట్ పెయింటింగ్‌ను పోలి ఉంటాయి.

Gift To Italy

Gift To Italy

ఇటలీ ప్రధానమంత్రికి పటాన్ పటోలా దుపట్టా

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి పటాన్ పటోలా కండువా కప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉత్తర గుజరాత్‌లోని పటాన్ ప్రాంతంలో సాల్వి కుటుంబాలు రూపొందించిన కళరూపం పటాన్ పటోలా వస్త్రం. దీనిలో ఉపయోగించే రంగులు చాలా కళాత్మకంగా ఉంటాయి. పటోలే అనేది సంస్కృత పదం. దీనికి అర్థం పట్టు లేదా పట్టు వస్త్రం. 11వ శతాబ్దంలో నిర్మించిన పటాన్‌లోని మెట్ల బావి అయిన ‘రాణి కి వావ్’ నుండి ప్రేరణ పొంది.. దీనిని అభివృద్ధి చేసినట్టు చెబుతారు. పటాన్ పటోలా దుపట్టా ను చెక్కతో చేసిన ‘సడేలి’ అనే పెట్టెలో పెట్టి రూపొందిస్తారు.

Gift To France, Germany, Si

Gift to France, Germany, Singapore

ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్ నేతలకు అగేట్ బౌల్ ఆఫ్ కచ్

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగేట్ బౌల్ బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రం అగేట్ క్రాఫ్ట్‌కు ప్రసిద్ధి చెందింది. చాల్సెడోనిక్ – సిలికాతో రూపొందించిన విలువైన రాయి. నది వెంబడి ఉన్న రాజ్‌పిప్లా , రతన్‌పూర్ భూగర్భ గనులలో ఈ విలువైన రాయి లభ్యమవుతోంది. ఈ రాయితో వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన హస్తకళాకారులు ఈ కళాఖండాలను రూపొందిస్తారు. అందుకే వీటికి ప్రజాదరణ ఎక్కువ.ఈ విలువైన సాంప్రదాయ క్రాఫ్ట్ సింధు లోయ నాగరికత కాలం నుండి తరతరాలుగా చేతివృత్తుల ద్వారా అందించబడుతోంది. ప్రస్తుతం ఖంబత్ అనే కళాకారులు వీటిని తయారు చేస్తున్నారు. వీటిని గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఆభరణాలుగా చూడవచ్చు.

Gift To Country Of Indonesi

Gift To Country Of Indonesi

Gift To Indonesia

Gift To Indonesia

ఇండోనేషియా అధ్యక్షుడికి రెండు బహుమతులు

జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు రెండు బహుమతులు అందజేశారు. గుజరాత్‌లోని సూరత్ నుండి వెండి శాలువను, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ నుండి శాలువాను ప్రధాని మోదీ బహూకరించారు. స్వచ్ఛమైన వెండితో ప్రత్యేకంగా రూపొందించబడిన గిన్నె. ఇది గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలోని సాంప్రదాయ, అత్యంత నైపుణ్యం కలిగిన లోహ కళాకారులచే రూపొందించబడింది. ఈ కళరూపానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఈ వెండి కళా రూపాన్ని తయారు చేయడం చాలా క్లిష్టతరం. సహనం, నైపుణ్యం కలిగిన చేతిపని వారు చాతుర్యం, సృజనాత్మకతతో తయారు చేస్తారు. ఈ అద్భుతమైన రూపాన్ని సమకాలీన, సాంప్రదాయ పద్దతులకు జోడించి రూపొందిస్తారు.

కిన్నౌరి శాలువ

కిన్నౌరి శాలువ హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా ప్రత్యేకత. ఈ ప్రాంతంలో ఉన్ని మిల్లింగ్ , వస్త్రాల తయారీదారులు రూపొందించే పురాతన సంప్రదాయ కళ ఇది. దీని రూపకల్పనలో మధ్య ఆసియా, టిబెట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో