
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాన్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాన్ కుటుంబంలో మరోసారి చేరడం ఆనందంగా ఉందని చెప్పారు. తాజాగా విజయవంతంగా సదస్సు నిర్వహించినందుకు అన్వర్ ఇబ్రహీంకు అభినందనలు తెలియజేశారు. అలాగే, ఆసియాన్‌లో కొత్త సభ్య దేశంగా చేరిన తిమోర్-లెస్టేకు స్వాగతం పలికారు. థాయ్‌లాండ్ క్వీన్ మదర్ మరణంపై సంతాపం కూడా వ్యక్తం చేశారు.
భారత్, ఆసియాన్ కేవలం భౌగోళికంగా మాత్రమే కాకుండా, సంస్కృతి, విలువల పరంగా కూడా దగ్గరగా ఉన్నాయని మోదీ చెప్పారు. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు మాత్రమే కాక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలు కూడా బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసియాన్ భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక స్తంభమని, ఆసియాన్ సెంట్రాలిటీని, ఇండో పసిఫిక్ దృష్టికోణాన్ని భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టమైంది.
ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నిరంతరం బలపడుతోందని మోదీ అన్నారు. ఈ బలమైన భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, అభివృద్ధికి మూలం అవుతోంది అని చెప్పారు. ఈ ఏడాది ఆసియాన్ సదస్సు థీమ్ ‘ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ’గా ఉండడం మన ఉమ్మడి కృషిని ప్రతిబింబిస్తున్నదని, డిజిటల్ ఇన్‌క్లూజన్, ఫుడ్ సెక్యూరిటీ, సరఫరా గొలుసు స్థిరత్వం వంటి రంగాల్లో సహకారం మరింత బలపడుతోందని వివరించారు.
భారత్ ఎప్పుడూ ఆసియాన్ భాగస్వాములతో కష్టసమయాల్లో నిలబడిందని, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, సముద్ర భద్రత, బ్లూ ఎకానమీ రంగాల్లో సహకారం వేగంగా పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2026 ను ‘భారత్ఆసియాన్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటించారు. అలాగే విద్య, పర్యటన, విజ్ఞాన సాంకేతికం, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తరిస్తుందని చెప్పారు.
21వ శతాబ్దం భారత్-ఆసియాన్ శతాబ్దం అని మోదీ ధీమాగా పేర్కొన్నారు. ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045 మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాలు కలసి ప్రపంచ మానవాళికి ప్రకాశవంతమైన భవిష్యత్తు చూపుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
My remarks during the ASEAN-India Summit, which is being held in Malaysia. https://t.co/87TT0RKY8x
— Narendra Modi (@narendramodi) October 26, 2025